నేడు ‘పీజీఆర్‌ఎస్‌’ | - | Sakshi
Sakshi News home page

నేడు ‘పీజీఆర్‌ఎస్‌’

Mar 23 2026 8:27 AM | Updated on Mar 23 2026 8:27 AM

నేడు ‘పీజీఆర్‌ఎస్‌’ నేడు బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ శ్రీరెడ్డెమ్మకొండలో భక్తుల రద్దీ గేట్‌పరీక్షలో ప్రతిభ

మదనపల్లెటౌన్‌: మదనపల్లె నూతన జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమం జరుగుతుందని జిల్లా ఎస్పీ ధీరజ్‌ కునుబిల్లి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజల నుంచి అర్జీలను నేరుగా స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాని కోరారు.

వాల్మీకిపురం: వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామాలయంలోని శ్రీ పట్టాభిరాముడి బ్రహ్మోత్సవాలు సోమవారం అంకురార్పణతో ప్రారంభం కానున్నాయి. ఇందుకు కోసం టీటీడీ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పందిళ్లు, విద్యుత్‌ దీపాలంకరణలు, లైటింగ్‌ బోర్డులు, మైక్‌లు ఏర్పాటు చేశారు. ఉదయం స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి, మూలవర్లకు అభిషేకం, అలంకరణ, తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం, అర్చన, మొదటి గంట, బలి, శాత్తుమొర నిర్వహిస్తారు. రాత్రి కై ంకర్యములు, స్వస్తి పుణ్యహవచనం, మృత్సంగ్రహణం, అంకురార్పణ, ఏకాంత సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారి క్రిష్ణమూర్తి, నాగరాజ, నగేష్‌లు తెలిపారు.

గుర్రంకొండ: మండలంలోని చెర్లోపల్లె గ్రామంలో వెలసిన సంతాన దేవత శ్రీ రెడ్డెమ్మతల్లి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీనెలకొంది. అమ్మవారికి వేకువజామునే పలు రకాల నైవేద్యాలు సమర్పించి విశేష పూజలు,అభిషేకాలు నిర్వహించారు. ఆలయ పరిసరాల్లోని దిగువ తొట్లివారిపల్లెలో అమ్మవారి అర్చకుల కుటుంబీకులు పంపిణీ చేసే ఆకు పసరును సేవించి మహిళలు అమ్మవారి కోనేట్లో పవిత్ర స్నానమాచరించిచారు. తడిబట్టలతోనే అమ్మవారి ఎదుట సంతానం కోసం వరపడ్డారు.మొక్కులు తీరిన భక్తులు అమ్మవారికి బంగారు, వెండి, చీరెసారెలతో మొక్కులు చెల్లించుకొన్నారు. హిందువులతో పాటు ముస్లింలు పెద్ద ఎత్తున ఆలయానికి తరలిరావడం విశేషం.

జమ్మలమడుగు: వైఎస్సార్‌ కడప జిల్లా ఉప్పలపాడు గ్రామానికి చెందిన తలారి మోహన్‌ అనే విద్యార్థి గేట్‌ పరీక్షల్లో జాతీయ స్థాయిలో 89వ ర్యాంకును సాధించాడు. గత ఫిబ్రవరి 19న గేట్‌పరీక్షలు నిర్వహించారు. ఈ నెల 19న వెలువడిని ఫలితాల్లో మోహన్‌ 89వర్యాంకు సాధించినట్లు తల్లిదండ్రులు లక్ష్మీదేవి, సంజీవరాయులు తెలిపారు. ప్రస్తుతం కర్నూల్‌ పుల్లారెడ్డి ఇంజినీరింగ్‌ కాలేజీ టెక్‌ ఫైనలియర్‌ చదువుతున్నట్లు చెప్పారు. కుమారుడు 89వ ర్యాంకు సాధించడం ఎంతో ఆనందంగా ఉందని తల్లిదండ్రులు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement