బెంగళూరులో ఉన్న శివకుమార్ రెడ్డి పిల్లలతో పాటు స్నేహితుడు, అత్త పద్మావతమ్మతో జాతరకు రావడం, తీరని విషాదం చోటుచేసుకోవడంతో కుంగిపోయాడు. ఆఊరిలో వీరి ఇంటి వద్దే చాందినీ బండి కూడా కట్టారు. సాయంత్రం జాతరకు వెళ్లాల్సి ఉంది. ఇంతలో ఊయల ఊగుతున్న మధుప్రియకు విద్యుత్‌షాక్ తగలడం, వారిని కాపాడబోయి పద్మావతమ్మ, రాపూర్ వెంకటేష్ అక్కడికక్కడే విగత జీవులయ్యారు. దీంతో ఒక వైపు బిడ్డలు తృటిలో స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడటం, మరో వైపు అత్త, జతగా వచ్చిన మిత్రుడు మృత్యు ఒడికి చేరడం అతన్ని దహించి వేస్తోంది. ఇలా అవుతుందని ఊహించలేదని కంటతడిపెట్టారు.


