సంతకం.. సమరనాదం
ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి...
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ చేపట్టిన కోటిసంతకాల సేకరణకు విశేష స్పందన లభించింది. రాష్ట్రంలో విద్యార్థులు, ప్రజల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుకోవాలి. పక్క రాష్ట్రాల్లో తక్కువ మార్కులకు మెడికల్ సీటు దొరికే అవకాశాల ఉంటే.. మన రాష్ట్రంలోని విద్యార్థులు వారి కంటే మెరుగైన మార్కులు తెచ్చుకున్నా సీటు దక్కకుండా పోతోంది. దీనివల్ల పేదలకు వైద్యవిద్య అందని ద్రాక్షలా మారుతుంది. ప్రైవేటీకరణపై విద్యార్థుల నుంచి వ్యతిరేకతను గుర్తించి చంద్రబాబు ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని మార్చుకోవాలి.
– నూర్ సయ్యద్‌బాషా, పీలేరు
ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్‌పరం చేయడాన్ని నిరసిస్తూ విద్యార్థి లోకం రణం మొదలుపెట్టింది. ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపి చేపట్టిన కోటి సంతకాల సేకరణలో తమదైన పాత్ర పోషించారు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంతకాలు చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. లక్షలాది మంది యువత, విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై పలువురి మనోగతం.
పేదలకు వైద్యవిద్య దూరం చేయడమే...
పేద విద్యార్థులను ఆదుకోవడానికి గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి 17 మెడికల్ కళాశాలలో మంజూరు చేశారు. వాటి నిర్మాణాలు కూడా వివిధ దశల్లో ఉన్నాయి. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తే పేద విద్యార్థులకు వైద్యవిద్య దూరం చేసినట్లే.
– అత్తార్ రిజ్వాన్, పీలేరు.
ప్రభుత్వ నిర్ణయం సరికాదు
వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేయడం సరికాదు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం ఖరీదైనది కావడంతో పేదలకు వైద్యం దూరమవుతుంది.ఈ విషయంలో ప్రభుత్వం పునరాలోచించి ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి.
–ఎం.మేఘన, పుల్లంపేట
ప్రభుత్వం పునరాలోచించాలి
మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తే గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద, మధ్య తరగతి విద్యార్థులు వైద్య విద్య దూరమవుతుంది. విద్య, వైద్య రంగాలను ప్రభుత్వమే నడపాలి. అప్పుడే సామాన్యులకు న్యాయం జరుగుతుంది. ప్రభుత్వం పునరాలోచించాలి.
–గౌస్‌అహ్మద్, విద్యార్థి, తంబళ్లపల్లె
ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలి
మెడికల్ కళాశాలలు ప్రైవేట్ పరం చేస్తే ఫీజులు అమాంతంగా పెరిగిపోతాయి. పేద విద్యార్థులు లక్షల్లో ఫీజులు చెల్లించి వైద్యవిద్య పొందే అవకాశం ఉండదు. మెడికల్ కళాశాలలు అన్ని ప్రభుత్వ ఆధీనంలోనే నడవాలి. కూటమి ప్రభుత్వం పీపీపీ విధానంపై చూపుతున్న ప్రయత్నాలను తక్షణం ఉపసంహరించుకోవాలి. – కె.ఎస్. అర్షద్, పీలేరు.
ప్రైవేటీకరణను తక్షణం ఆపాలి
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణతో పేద విద్యార్థులకు నష్టం వాటిల్లుతుంది. వైఎస్‌ఆర్‌సీపీ ఇచ్చిన పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణలో విద్యార్థులు పాల్గొని ప్రభుత్వంపై వ్యతిరేకత చాటారు.ప్రైవేటీకరణను తక్షణం ఆపాలి.
– ఎం.యశ్వంతిసాయి, నందలూరు
సంతకం.. సమరనాదం
సంతకం.. సమరనాదం
సంతకం.. సమరనాదం
సంతకం.. సమరనాదం
సంతకం.. సమరనాదం
సంతకం.. సమరనాదం
సంతకం.. సమరనాదం


