ప్రైవేటీకరణపై సీపీఐ పోరుబాట
మదనపల్లె: ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించకపోతే ఇక ప్రభుత్వం ఎందుకని సీపీఐ రాష్ట్ర, జిల్లా నాయకులు చంద్రబాబును నిలదీశారు. వైద్య కళాశాలలను పీపీపీ విధానంలోకి మార్చడాన్ని వేతిరేకిస్తూ గురువారం సీపీఐ శ్రేణులు జిల్లా వ్యాప్తంగా మదనపల్లి మెడికల్ కళాశాల వద్దకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. భవనాల వద్ద బైఠాయించి ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హజరైన సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ.రామానాయుడు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను గత ప్రభుత్వం అమలులోకి తీసుకుని వచ్చిందన్నారు. చాలా కళాశాలలు సగానికి పైగా పూర్తయ్యాయన్నారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన 107, 108 జీఓలను రద్దు చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం, ఈ జీఓలను యధావిధిగా కొనసాగిస్తూనే ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడానికి జీఓ నబబర్ 590 తీసుకొచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీపీపీ విధానంతో మెడికల్ కళాశాలలు అభివృద్ధి చెందుతాయని రాష్ట్ర సీఎం, మంత్రులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఈ విధానంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో నడుస్తున్న డయాలసిస్ కేంద్రాలు కిడ్నీ వ్యాపారం కేంద్రాలు మారిపోతున్న విషయాన్ని ప్రస్తావించారు. పీపీపీ విధానంతో అవినీతి జరుగుతుందే తప్ప అభివృద్ధి ఉండదన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం జీవో నంబర్ 590 వెంటనే రద్దుచేసి, మెడికల్ కళాశాలలను ప్రభుత్వం ఆధీనంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వలరాజ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు రెడ్డిసాహెబ్, స హాయ సీపీఐ జిల్లా కార్యదర్శి మహేష్, సహాయ కార్యదర్శి టి కష్ణప్ప, కార్యవర్గ సభ్యులు మనోహర్ రె డ్డి, శ్రీనివాసులు, సాంబశివ పాల్గొన్నారు.
పీపీపీ విధానంతో జరిగేది అభివృద్ధికాదు అవినీతి
మదనపల్లె మెడికల్ కళాశాల వద్ద ధర్నా


