పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి
రాయచోటి: పిల్లల పోషణ, ఎదుగుదల, ఆరోగ్య ఫలితాలను మెరుగు పరచడానికి ఐసీడీఎస్ శాఖ పనితీరు కీలకమని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని బాల సంజీవిని, టీహెచ్‌ఆర్ డిస్ట్రిబ్యూషన్, గ్రోత్ రిపోర్టు పోషణ్ ట్రాకర్, పీఈఎస్ హాజరు, బీఎస్ కిట్ తదితర అంశాలపై సీడీపీఓలు, సూపర్ వైజర్లతో ఆయన సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఐసీడీఎస్ పీడీ హైమావతి, జిల్లాలోని సీడీపీఓలు, సూపర్ వైజర్లు తదితరులు పాల్గొన్నారు.
ఒంటిమిట్ట: ఆంధ్ర భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయ హుండీ ఆదాయాన్ని మంగళవారం ఆలయ టీటీడీ అధికారులు లెక్కింపు చేశారు. ఈ సందర్భంగా నవంబర్ 11 నుంచి డిసెంబర్ 9 వరకు శ్రీరాముడిని దర్శించుకున్న భక్తులు హుండీలో వేసిన కానుకలను లెక్కించారు. ఆలయ రంగమండపంలో ఈ లెక్కింపు జరిగింది. హుండీ ఆదాయం రూ.5,91,855 వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
కడప కార్పొరేషన్: కడప మేయర్ ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈనెల 11వ తేది మేయర్ ఎన్నిక నిర్వహించాలని ఎన్నికల కమి షన్ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో వాటిని మాజీ మేయర్ కె. సురేష్ బాబు హైకోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసిందే. తాను వేసిన పిటిషన్‌పై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వకమునుపే మేయర్ ఎన్నిక నిర్వహించడం సరికాదంటూ సురేష్ బాబు హైకోర్టును ఆశ్రయించారు.
పీలేరు: హౌసింగ్‌లో మంజూరైన ఇళ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్‌కుమార్ అన్నారు. మంగళవారం పీలేరు పట్టణం ఏపీఐఐసీ–1 కాలనీలో గృహ నిర్మాణ పనులను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హౌసింగ్ అధికారులతో సమీక్ష జరిపి వివిధ దశల్లో ఉన్న గృహ నిర్మాణాలపై సమగ్రంగా వివరాలు సేకరించారు. నివాసం ఉన్న లబ్ధిదారులకు మౌలిక వసతులను కల్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ రమేష్‌రెడ్డి, మండల తహశీల్దార్ శివకుమార్, ఎంపీడీవో శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.


