చెరువులో పడి యువకుడి మృతి
పీలేరురూరల్ : పీలేరు పట్టణ శివారు ప్రాంతం జీవనచెరువులో పడి ఓ యువకుడు మృతి చెందాడు. ఎస్‌ఐ లోకేష్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పీలేరు పట్టణం కోటపల్లెకు చెందిన బి. ఆనంద్ (30) శుక్రవారం ఇంటినుంచి వెళ్లిపోయాడని ఆదివారం కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే మంగళవారం ఆనంద్ జీవనచెరువులో శవమై తేలాడు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలా న్ని పరిశీలించి మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతునికి భార్య భాగ్యరాధ, కుమారుడు భార్గవ్ ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
అగ్నిమాపక కేంద్రం తనిఖీ
మదనపల్లె రూరల్ : మదనపల్లె అగ్నిమాపక కేంద్రాన్ని మంగళవారం జిల్లా అగ్నిమాపక అధికారి పి.అనిల్‌కుమార్ తనిఖీ చేశారు. కార్యాలయంలోని పలు రికార్డులను పరిశీలించారు. ఏడాదికాలంగా మదనపల్లె ఫైర్ స్టేషన్ పరిధిలో జరిగిన ప్రమాదాలు, తీసుకున్న చర్యలు, నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా అగ్నిమాపక అధికారి మాట్లాడుతూ స్టేషన్‌లోని అగ్నిమాపక పరికరాలు, రికార్డులు, స్టాక్‌ను పరిశీలించామన్నారు. కార్యక్రమంలో ఫైర్ ఇన్స్‌పెక్టర్ శివప్ప, సిబ్బంది పాల్గొన్నారు.
కరిగి పోతున్న
గుట్టపై విచారణ
రొంపిచెర్ల : చిత్తూరు–అన్నమయ్య జిల్లా సరిహద్దులో అనుమతులు లేకుండా గుట్టను కరిగిస్తున్నారని సాక్షి దిన పత్రికలో సోమవారం ప్రచురితమైన వార్తపై రెండు జిల్లాల మైనింగ్ అధికారులు స్పందించారు. ఈమేరకు మంగళవారం దాడులు చేసి పనులు నిలిపి వేశారు. చిత్తూరు జిల్లా మైనింగ్ ఏడీ సత్య నారాయణ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. అన్నమ్మయ్య జిల్లా పీలేరు మండలం గూడరేవుపల్లె, చిత్తూరు జిల్లా రొంపిచెర్ల మండలం చిచ్చిలివారిపల్లె గ్రామ సరిహద్దులో గుట్టను కొల్లగొడుతున్న స్థలాన్ని పరిశీలించామని తెలిపారు. అక్కడ రాళ్లు కొడుతున్న కూలీలను బయటకు పంపించామన్నారు. ఈ రాయి సమీపంలోని క్రషర్‌కు రవాణా అవుతుందని కూలీలు చెప్పారన్నారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి స్టోన్ క్రషర్‌పై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
చెరువులో పడి యువకుడి మృతి
చెరువులో పడి యువకుడి మృతి


