 
															30 నుంచి మాసోత్సవాలు
రాజంపేట రూరల్ : టీటీడీ, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీ నుంచి నవంబరు 5వ తేదీ వరకూ కార్తీక మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రోగ్రామ్ అసిస్టెంట్ డాక్టర్ టి.గోపీబాబు, ధర్మాచార్యులు గంగనపల్లి వెంకటరమణ తెలిపారు. మండలంలోని ఊటుకూరు శివాలయంలో బుధవారం కార్యక్రమాల పోస్టర్లు ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ రోజూ సాయంత్రం ధార్మికోపన్యాసం, భజన ఉంటాయని తెలిపారు.
యువకుడు ఆత్మహత్యాయత్నం
మదనపల్లె రూరల్ : చీటి డబ్బు ఇవ్వలేదని యువకుడు విష ద్రావణం తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడిన సంఘటన మంగళవారం రాత్రి మదనపల్లెలో జరిగింది. బాధితుడి కుటుంబీకులు, ఆస్పత్రి అవుట్‌పోస్టు పోలీసుల వివరాల మేరకు.. బసినికొండ పంచాయతీ వడ్డిపల్లికి చెందిన గోపాల్ కుమారుడు విజయ్(22) స్థానికంగా ఉన్న ఓ మహిళ వద్ద రూ.50 వేల చీటీ వేశాడు. కంతులు పూర్తి స్థాయిలో చెల్లించేసి తనకు రావాల్సిన డబ్బు నిర్వాహకురాలు ఇవ్వకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. తాను అప్పుచెల్లించాల్సిన వ్యక్తుల వద్ద నుంచి ఒత్తిడి అధికం కావడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. బాధితుడిని కుటుంబస భ్యులు స్థానిక ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. వన్‌టౌన్ పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.
కుటుంబ సమస్యలతో ఆటో డ్రైవర్
మదనపల్లె రూరల్ : కుటుంబ సమస్యలతో ఆటో డ్రైవర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన బుధవారం మదనపల్లెలో జరిగింది. స్థానిక కాలనీగేటుకు చెందిన యూనస్(27) ఆటో డ్రైవర్‌గా జీవిస్తున్నాడు. ఈ క్రమంలో కుటుంబ సమస్యలు అధికం కావడంతో మనస్థాపం చెంది ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబసభ్యులు బాధితుడిని స్థానిక ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.
విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి
లింగాల : మండలంలోని దొండ్లవాగు గ్రామంలో విద్యుత్ షాక్‌కు గురై గొడ్డలి వెంకట్రాములు (60) బుధవారం మృతిచెందాడు. ఎస్‌ఐ అనిల్‌కుమార్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బుధవారం ఉదయం వెంకట్రాములు తన ఇంటిలో విద్యుత్ స్విచ్ బోర్డు మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తూ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందారు. అతడకి భార్య, కుమారుడు ఉన్నారని తెలిపారు. వెంకట్రాములు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులకు అందించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.
వ్యక్తి ఆత్మహత్య
చక్రాయపేట: మండలంలోని పోలిశెట్టిపల్లెకు చెందిన మాచనబోయిన సిద్ధయ్య(50) ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. దీనికి తోడు ఆస్తి తగాదాలు, కుటుంబ కలహాలు ఉండడంతో శరీరంపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. గ్రామస్థులు కడప రిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ అక్కడ మృతి చెందారని కుటుంబీకులు తెలిపారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
