 
															బడి పిల్లలతో ప్రమాదకర పనులు
రైల్వేకోడూరు : గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో గిరిజన బిడ్డల కోసం అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు మండలం అనంతరాజుపేట పంచాయతీలో మినీ గురుకులం బాలిక పాఠశాలను స్థాపించారు. 150 మంది విద్యార్థులు హాస్టల్‌లో ఉంటూ విద్యను అభ్యసిస్తున్నారు. పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పి వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత కలిగిన ప్రిన్సిపల్ వారిచేత ప్రమాదకరమైన వెట్టిచాకిరీ పనులు చేయిస్తున్నారు. బుధవారం పాఠశాలలోని నీళ్ల ట్యాంకులోకి బాలికలను దింపి వారిచేత శుభ్రం చేయించారు. పొరబాటున పిల్లలు నీళ్ల ట్యాంకులో ఇరుక్కుపోవడమో.. లేదా మరేదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిదని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. అలాగే పిల్లలచేత చెత్త ఊడ్పించే పని కూడా చేయించడంపై మండిపడుతున్నారు. ప్రిన్సిపల్ వైఖరి కారణంగా గతంలో ఇదే పాఠశాలలో ఐదుగురు ఉపాధ్యాయులు రాజీనామా చేశారని ఎస్టీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు పి.శివశంకర్ పేర్కొన్నారు. విద్యార్థులచే వెట్టి చాకిరీ చేయించిన ప్రిన్సిపల్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రాయచోటి వాసులు నన్ను ఆదరించారు
రాయచోటి టౌన్ : రాయచోటి ప్రజలు ననున ఎంతో ఆదరించారు.. వృత్తి ధర్మంలో సహకరించారు.. నా కుటుంబసభ్యుల కన్నా ఎక్కువగా చూసుకున్నారు అని కడప అడిషనల్ ఎస్పీ కె.ప్రకాష్ బాబు భావోద్వేంతో అన్నారు. రాయచోటి ప్రైవేట్ పంక్షన్ హాల్‌లో స్థానికులు ఆయనకు అభినందన సభ ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో పుట్టినప్పటికీ తొలిసారి ఎస్‌ఐ ఉద్యోగం నుంచి ఇప్పటి వరకూ కడప జిల్లాలోనే ఉద్యోగం చేశానని చెప్పారు. ట్రాఫిక్ నియంత్రణ, ఇతర సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతో రాయచోటి ప్రజలతో ఎక్కువ అనుబంధం ఏర్పడిందని తెలిపారు. పదవీ విరమణ తర్వాత రాయచోటి లోనే స్థిరపడాలనే అలోచన ఉందని తెలిపారు. 12 ఏళ్ల కిందట బదిలీపై వెళ్లిన తనను గెట్ టుగెదర్‌కు పిలవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో లయన్ హరినాథఽరెడ్డి, లయన్ నాగేశ్వరావు, సయ్యద్, ఇర్షాద్, జానకిరాం, ఖాదర్‌బాషా, అభిమానులు పాల్గొన్నారు.
 
							బడి పిల్లలతో ప్రమాదకర పనులు

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
