రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లాం
కృష్ణపట్నం రైలు మార్గంలో ప్యాసింజర్ రైలు నడిపించాలని చాలాసార్లు బోర్డు మీటింగ్‌లో అధికారులను కోరడం జరిగింది. రాజంపేట మాజీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కూడా రైల్వే మంత్రితో గతంలో మాట్లాడారు. రైల్వే స్టేషన్లు పూర్తిస్థాయిలో ఏర్పాటుచేసి రైలు నడిపిస్తామని అధికారులు చెబుతున్నారు.
– తల్లెం భరత్‌కుమార్‌రెడ్డి, డీఆర్‌యూసీసీ సభ్యుడు, గుంతకల్ రైల్వే డివిజన్
కడప నుండి ఓబలవారిపల్లె మీదుగా నెల్లూరుకు ప్యాసింజర్ రైలు ఏర్పాటు చేస్తే విద్యార్థులకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. వారు చదువుకునేందుకు సౌకర్యం కలుగుతుంది. దీంతోపాటు వ్యాపారులకు ప్రయోజనం కలుగుతుంది. ఈ సొరంగ మార్గంలో ప్రయాణించాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం. రైల్వే అధికారులు ప్యాసింజర్ రైళ్లు నడిపించాలి.
– డి.శ్రీరాములు, వ్యాపారి, అంగడి వీధి, కడప
రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లాం


