ప్రజలు అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Oct 29 2025 7:41 AM | Updated on Oct 29 2025 7:41 AM

ప్రజల

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

పెనగలూరు: తుపాను కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌, జిల్లా ఎస్పీ ధీరజ్‌ కునుబిల్లి పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం పెనగలూరు మండలం, ఎన్‌ఆర్‌ పురం పంచాయతీ, పల్లంపాడు గ్రామం వద్ద నదిలో నీటి ప్రవాహాన్ని వారు పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో మాట్లాడుతూ వర్షాలు తగ్గేంతవరకు ప్రజలు ఎవ్వరూ ఇంటిలో నుంచి బయటకు రాకూడదని హెచ్చరించారు. అలాగే పల్లంపాడు గ్రామస్తులు నది దాటి ఇవతలవైపునకు రాకూడదన్నారు. ప్రతి ఏడాది వర్షాకాలం వచ్చిందంటే తమ గ్రామానికి వెళ్లేందుకు దారులు లేక గర్భిణులు, అనారోగ్యంతో బాధపడేవారు, మహిళలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ప్రజలు కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. తకు ఎక్కడైనా ఇంటిస్థలం, కాలనీలు మంజూరు చేస్తే పూర్తిగా గ్రామమంతా బయటకు వస్తామని సర్పంచ్‌ సుజాత కలెక్టర్‌కు విన్నవించారు. ఈ విషయంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని గ్రామస్తులకు కలెక్టర్‌ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ భావన, డీఎస్పీ మనోజ్‌, సీఐ రమణ, ఎస్‌ఐ రవిప్రకాష్‌ రెడ్డి, తహసీల్దార్‌ అమరేశ్వరి, పలువురు అధికారులు పాల్గొన్నారు. కాగా, మండలంలోని గుంజన నది ప్రవహిస్తున్న సింగనమల, ఈటమాపురం గ్రామాల మధ్య ఉన్న బ్రిడ్జి వద్ద పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసినట్లు ఎస్‌ఐ రవిప్రకాశ్‌ రెడ్డి తెలిపారు.

కన్యకాచెరువు పరిశీలన..

నందలూరు: భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నందలూరు కన్యకాచెరువును జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌, జిల్లా ఎస్పీ ధీరజ్‌ కునుబిల్లి, రాజంపేట సబ్‌ కలెక్టర్‌ భావన, అడిషనల్‌ ఎస్పీ మనోజ్‌కుమార్‌హెగ్డేలతో కలిసి మంగళవారం పరిశీలించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ కన్యకా చెరువు నిండిన వెంటనే నీరు చెయ్యేరు నదిలో చేరుతుందన్నారు.

సోమశిల వెనుక జలాల పరిశీలన..

ఒంటిమిట్ట: మొంథా తుపాను కారణంగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలకు పెన్నానది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో ఒంటిమిట్ట మండలంలోని సోమశిల ముంపు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కడప ఆర్‌డీఓ జాన్‌ ఇర్విన్‌, గాలేరు–నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ శాంతమ్మ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని సోమశిల ముంపు ప్రాంతాలైన పెన్నపేరూరు, తప్పెటవారిపల్లి గ్రామాలతో పాటు పెన్నా తీరప్రాంతాలైన దవంతరపల్లి, నరసన్నగారిపల్లి గ్రామాలను సందర్శించారు. నదీతీర ప్రాంతంలో ఉన్న వారు ఎగువ ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు. ఒంటిమిట్ట తహసీల్దార్‌ దామోదర్‌రెడ్డి, సీఐ బాబు తదితరులు ఆయన వెంట ఉన్నారు.

పెనగలూరు: పల్లంపాడు వద్ద చెయ్యేరు నదిలో గ్రామస్తులతో మాట్లాడుతున్న

జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌, ఎస్పీ ధీరజ్‌ కునుబిల్లి

నందలూరు: కన్యకా చెరువును పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్‌

ప్రాజెక్టును పరిశీలిస్తున్న జల వనరుల శాఖ డీఈ చెంగల్‌రాయుడు

అన్నమయ్య జిల్లా కలెక్టర్‌, ఎస్పీ

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి 1
1/2

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి 2
2/2

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement