 
															అవినీతి రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలి
రాయచోటి: విధి నిర్వహణలో అధికారులు, సిబ్బంది చట్టానికి లోబడి విధులు నిర్వహించి అవినీతి రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలని డీఆర్‌ఓ మధుసూదన్‌రావు అభిప్రాయపడ్డారు. మంగళవారం రాయచోటి కలెక్టరేట్‌లో విజిలెన్స్ అవగాహన వారోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన డీఆర్‌ఓ మాట్లాడుతూ నూతనంగా విధులలోకి వస్తున్న అధికారులు, సిబ్బంది చట్టానికి లోబడి విధులు నిర్వహించాలన్నారు. కడప రేంజ్ ఏసీబీ ఇన్‌స్పెక్టర్ నాగరాజు మాట్లాడుతూ చట్టపరంగా వచ్చే ఆదాయం మినహా ఎలాంటి నగదు, బహుమతులు లాంటివి తీసుకున్నా చట్టపరంగా లంచం తీసుకున్నట్లు అవుతుందన్నారు. ఏసీబీ కేసులో పట్టుబడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అవినీతి కేసులపై ఫిర్యాదు చేసేందుకు 1064, 9440446191 నంబర్లలో సంప్రదించవచ్చన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, జిల్లా కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..
డీఆర్‌ఓ మధుసూదన్‌రావు

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
