 
															ఎన్‌జీసీ జిల్లా కో–ఆర్డినేటర్‌గా శివలక్ష్మి
రాయచోటి: అన్నమయ్య జిల్లా నేషనల్ గ్రీన్ కార్ప్(ఎన్‌జీసీ) జిల్లా కో–ఆర్డినేటర్‌గా బి.శివలక్ష్మీని నియమిస్తూ జిల్లా విద్యాశాఖాధికారి కె. సుబ్రమణ్యం ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం ఈ మేరకు నియామక ఉత్తర్వుల విషయాన్ని డీఈఓ వెల్లడించారు. ప్రస్తుతం ఆమె వీరబల్లి మండలం, పెద్దివీడు రెడ్డివారిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జీవశాస్త్ర ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నారు. ఏపీఎన్‌జీసీ జిల్లా కో–ఆర్డినేటర్‌గా నియామక ఉత్తర్వులు అందుకున్న అనంతరం ఆమె జిల్లా విద్యాశాఖ అధికారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్పగించినందుకు జిల్లా విద్యాశాఖ అధికారికి, ఎన్జీసీ రాష్ట్ర అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. డైట్ ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ మడితాటి నరసింహారెడ్డి, జిల్లా సైన్స్ అధికారి మార్ల ఓబుల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
