 
															● పంట నీట మునిగింది..
కడప అగ్రికల్చర్/సిద్దవటం: మోంథా తుఫాన్ ధాటికి వైఎస్సార్ జిల్లాలో నాలుగు మండలాల పరిధిలోని 25 గ్రామాల్లో 470 మంది రైతులకు సంబంధించి 270 హెక్టార్లకు పంటనష్ట వాటిల్లినట్లు జిల్లా వ్యవసాయ అధికారి చంద్రనాయక్ సూచించారు. సిద్దవటం మండలంలో 60 హెక్టార్లలో వరిపంట, గోపవరం మండలంలో 20 హెక్టార్లలో వరి, 5 హెక్టార్లలో మెక్కజోన్న, పోరుమామిళ్లలో 150 హెక్టార్లలో వరిపంట, బిమఠంలో 35హెక్టార్లలో వరిపంట తెబ్బతిన్నట్లు వ్యవసాయ అధికారులు ప్రాథమింగా నష్టాన్ని అంచనా వేశారు.
సిద్దవటం: మండలంలోని లింగంపల్లి, మంగలవారిపల్లె, కడపాయపల్లె గ్రామాల్లో పంట నష్టం ఎక్కువగా ఉంది.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
