 
															హర హర మహాదేవ !
రాయచోటి : కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా శివయ్యకు జిల్లా అంతటా భక్తులు ఘనంగా పూజలు నిర్వహించారు. శివజ్యోతులను వెలిగించి మనసారా మొక్కుకున్నారు. కార్తీక దీపాలు వెలిగించడం పుణ్యదాయకమని భావించి మహిళలు పెద్ద ఎత్తున దేవాలయాల ప్రాంగణాలలో దీపాలు వెలిగించారు. అర్చకులు శివయ్య మూలమూర్తికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. ఆలయ ప్రాంగణాలలో గణపతి, రుద్ర హోమాలు నిర్వహించారు. పూజలు జరుగుతున్నంతసేపు భక్తబృందాలు లింగాష్టకం ఆలపించారు. రాయచోటి, మదనపల్లె తంబళ్లపల్లె, పీలేరు, కోడూరు, రాజంపేట ప్రాంతాల్లోని శివాలయ ప్రాంగణాల్లో దీపాలు వెలిగించారు. ఉసిరి, జమ్మిచెట్లకు పూజలు జరిపారు.అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి భక్తిని చాటుకున్నారు.
రాజంపేట : ప్రత్యేక అలంకరణలో
రామలింగేశ్వరుడు
వైఎస్సార్ జిల్లా పుష్పగిరిలో
దీపాలు వెలిగిస్తున్న భక్తులు
 
							హర హర మహాదేవ !
 
							హర హర మహాదేవ !

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
