 
															విపత్తును ఎదుర్కొనేందుకు సిద్ధం
వీరపునాయునిపల్లె : మోంథా తుపాన్‌ను ఎదుర్కొనేందుకు సర్వం సిద్ధం చేసినట్లు విద్యుత్ సూపరింటెండెంట్ ఇంజినీర్ రమణ అన్నారు. సోమవారం వైఎస్సార్ కడప జిల్లా అయ్యవారిపల్లె విద్యుత్ సబ్‌స్టేషన్‌లో సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణలో భద్రతా ప్రమాణాలు, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్చిన చర్యలపై సిబ్బందికి సలు సూచనలందించారు. తుపాను ప్రభావం పూర్తిగా తగ్గిపోయేంతవరకు అదికారుల, సిబ్బందికి సెలవులు రద్దుచేశామని.. ప్రతి ఒక్కరూ 24గంటలు అందుబాటులో ఉండాలని సూచించారు. సమావేశాననంతరం విలేకరులతో మాట్లాడుతూ తుపాను సహాయక చర్యల్లో పాల్గొనేందుకు కడప నుంచి కాకినాడకు 20 బృందాలను పంపించామని వెల్లడించారు. సర్కిల్ కార్యాలయం కడప, కడప డివిజన్, పులివెందుల ప్రొద్దుటూరు, మైదుకూరులలో 5కంట్రోల్ రూమ్‌లు పని చేస్తున్నాయని వివరించారు. కంట్రోల్ రూమ్ నంబర్లు యల్‌యమ్‌సి సర్కిల్ కార్యాలయం కడప 9440817440, కడప డివిజన్ కార్యాలయం 9901761782, పులివెందుల 7893063007, ప్రొద్దుటూరు 7893261958,మైదుకూరు 9849057659 అత్యవసర పరిస్తితుల్లో ఈ నంబర్లకు సమాచారం అందించవచ్చని యన తెలిపారు. ఈ కార్యక్రమంలో యర్రగుంట్ల డీఈ కిరణ్, ఏఈ హరిప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
