 
															కువైట్‌లో ప్రజా ఉద్యమం పోస్టర్ల ఆవిష్కరణ
రైల్వేకోడూరు అర్బన్ : రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలను కూటమి సర్కారు ప్రైవేటుపరం చేస్తుండటంపై వైఎస్సార్‌సీపీ చేపట్టిన ప్రజా ఉద్యమం పోస్టర్లను ఆదివారం కువైట్‌లోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు మండల ఉపాధ్యక్షుడు, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు రామిరెడ్డి ధ్వజారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు చేసింది ఏమీలేదని విమర్శించారు. పేదప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి, పేదపిల్లలు వైదులు కావడానికి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకొస్తే.. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు వాటిని అమ్మేసుకుంటూ ప్రైవేట్‌పరం చేస్తున్నారని చెప్పారు. ప్రజల్లో చైతన్యం వస్తోందని, ఇకపై బాబు మోసపుపాలన సాగదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ కువైట్ కన్వీనర్ బాల్‌రెడ్డి, మహేశ్వర్‌రెడ్డి, మన్నూరు చంద్రశేఖర్‌రెడ్డి, అహ్మద్, చంద్రశేఖర్‌రెడ్డి మహేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
