 
															మైలవరానికి నీరు విడుదల
కొండాపురం: గండికోట ప్రాజెక్టు నుంచి రెండు క్రస్ట్ గేట్లు ద్వారా 5 వేల క్యూసెక్కులనీటిని మైలవరం జలాశయానికి వదులుతున్నట్లు జీఎన్‌ఎస్‌ఎస్‌ఈఈ ఉమా మహేశ్వర్లు ఆదివారం తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి వరదనీరు రావడంతో ఆవుకు రిజర్వాయర్ నుంచి 3 వేల క్యూస్కెలనీరు గండికోట ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో ఉందన్నారు. అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలం లోని చాగల్ల రిజర్వాయర్ నుంచి వేయ్యి క్యూసెక్కులనీటిని పెన్నానదికి వదలడంతో గండికోట జలాశయంలోకి రాత్రి వచ్చి చేరుతాయన్నారు. ప్రస్తుతం గండికోట జలాశయం పూర్తినీటిసామర్థ్యం 26.85 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 26.3 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. ఈ నేపథ్యంలో 5 వేల క్యూసెక్కులనీటిని ఆదివారం సాయంత్రం దిగువకు మైలవరం జలాశయానికి వదిలినట్లు వెల్లడించారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
