 
															రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలు ప్రారంభం
రైల్వేకోడూరు: రైల్వేకోడూరు టివిఎస్‌ఆర్ కల్యాణ మండపంలో ఆదివారం రాష్ట్రస్థాయి ఎస్‌జీఎఫ్ అండర్–19 తైక్వాండో పోటీలు ప్రారంభమయ్యాయి.ఉమ్మడి 13 జిల్లాలకు సంబంధించిన 300 మంది బాల బాలికలు పాల్గొన్నారు. ఆది, సోమవారాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు కడప జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ టీఎన్‌వీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఇక్కడ ఎంపికై న విద్యార్థులు జమ్మూకశ్మీల్‌రో జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో చిన్నఓరంపాడు జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ హరిత, రాష్ట్ర పరిశీలకులు వి శ్రీనివాసులు, వ్యాయామ ఉపాధ్యాయుడు ఎ సుబ్బరాజు,నాగేశ్వరరెడ్డి, ఓబుల్ రెడ్డి, మురళీకృష్ణారెడ్డి, నీలకంఠరావు పాల్గొన్నారు.
రాయచోటి: జిల్లాలో కాంట్రాక్టు క్యారేజీ బస్సులపై 59 కేసులు నమోదు చేసినట్లు జిల్లా రవాణాశాఖ అధికారి ప్రసాద్ తెలిపారు. రవాణ కమిషనర్ ఆదేశాల మేరకు రెండురోజులుగా కాంట్రాక్ట్ క్యారేజీ బస్సులపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించినట్లు ఆదివారం ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ బస్సుల రికార్డులను పరిశీలించి 59 కేసులు నమోదు చేశామన్నారు. కేసులు ద్వారా రూ. 1,54,100లు జరిమానా విధించామన్నారు. ఉల్లంఘనలు అరికట్టేందుకు ఈ డ్రైవ్ మరికొన్ని రోజులు కొనసాగుతుందని తెలిపారు.
 
							రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలు ప్రారంభం

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
