 
															సమాజంలో పోలీసుల పాత్ర చాలా గొప్పది
రాయచోటి టౌన్ : నేటి సమాజంలో పోలీసుల పాత్ర చాలా కీలకమైనది.. అసాంఘిక కార్యకలాపాలను నిలువరించాలన్నా.. శాంతి భద్రతలను నెలకొల్పాలన్నా అది పోలీస్ వ్యవస్థతోనే సాధ్యమని అన్నమయ్య జిల్లా పోలీస్ శాఖ అడ్మిన్ ఆర్‌ఐ వీజే రామకృష్ణ అన్నారు. ఆదివారం పోలీసుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా ఆదివారం రాయచోటి డైట్ కళాశాలలో డైట్ ఇన్‌చార్జి ప్రిన్సిపల్ మడితాటి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులకు, పోలీసుల పిల్లలకు వక్తృత్వ, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి రూ.5 వేలు, రూ.3 వేలు, రూ.2 వేలు నగదు పురస్కారాలను అందించారు. అనంతరం ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ భద్రత, సామాజిక బాధ్యత, నైతిక విలువలు వంటి విషయాలపై ప్రజలకు అవగాహన కల్పించి భావిభారత పౌరులుగా ఎదిగేందుకు పోలీస్ వ్యవస్థ ఎంతో దోహదపడుతోందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఐ అమరనాథరెడ్డి, అధ్యాపకులు గిరిధర్, వెంకటసుబ్బారెడ్డి, శ్రీనివాసులు, మోహన్ నాయక్, రెడ్డెప్ప రెడ్డి, శివభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
