వీఆర్‌ఓకు తీవ్ర గాయాలు | - | Sakshi
Sakshi News home page

వీఆర్‌ఓకు తీవ్ర గాయాలు

Oct 27 2025 8:10 AM | Updated on Oct 27 2025 8:10 AM

వీఆర్

వీఆర్‌ఓకు తీవ్ర గాయాలు

వీఆర్‌ఓకు తీవ్ర గాయాలు రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

రాజంపేట రూరల్‌ : రై ల్వేకోడూరు పట్టణ వీఆర్‌ఓగా విధులు నిర్వహిస్తున్న చాపల పెంచలయ్యకు రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. ఓబులవారిపల్లి మండల పరిధిలోని జాతీయ రహదారిపై పామలేరు వద్ద ఆదివారం గుర్తు తెలియని వాహనం వెనక వైపు నుంచి పెంచలయ్య ద్విచక్రవాహనం అయిన స్కూటీని ఢీ కొట్టింది. రహదారి పక్కన పడిపోయిన పెంచలయ్యను తిరుపతి నుంచి వస్తున్న ప్రైవెట్‌ అంబులెన్స్‌ యజమాని శేఖర్‌ రాజంపేట ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చారు. తలకు, కాలికి తీవ్ర గాయాలు అయిన పెంచలయ్యకు ప్రాథమిక వైద్యం నిర్వహించారు. అనంతరం తిరుపతికి రిఫర్‌ చేశారు.

చిన్నమండెం : మండల పరిధిలోని దేవగుడిపల్లి గ్రామం జల్లావాండ్లపల్లి సమీపంలో ఆగివున్న ట్రాక్టర్‌ ట్యాలీని ఢీకొని అజయ్‌కుమార్‌ (19) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. వారి కథనం మేరకు.. అజయ్‌కుమార్‌ తన తల్లి విజయనిర్మలతో కలిసి రాయచోటిలోని ఏజీ గార్డెన్‌లో నివసిస్తున్నాడు. సొంత పనుల నిమిత్తం ద్విచక్రవాహనంలో గుర్రంకొండకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

నిర్లక్ష్యంగా బైక్‌ నడిపిన యువకుడిపై కేసు నమోదు

వేంపల్లె : నిర్లక్ష్యంగా మోటార్‌ బైక్‌ నడిపిన దర్బార్‌ అనే యువకుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తిరుపాల్‌ నాయక్‌ తెలిపారు. శనివారం సాయంత్రం వేంపల్లెలోని పులివెందుల – గండి బైపాస్‌ రోడ్డులోని మదీనాపురం సమీపంలో దర్బార్‌ అనే యువకుడితో పాటు మరో ఐదుగురు యువకులు 3 మోటార్‌ బైకుల్లో అతివేగంగా, అజాగ్రత్తగా నడుపుతూ పెద్దగా శబ్దం చేయడంతో పాటు మోటార్‌ బైకు ముందు చక్రాలను లేపి వెనుక చక్రాలపై మోటార్‌ బైకు నడిపి ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారన్నారు. ఈ నేపథ్యంలో మోటార్‌ బైకులను నడిపిన యువకులను, వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్‌ ఇచ్చినట్లు చెప్పారు. అలాగే వారిపై కేసు నమోదు చేసి మోటార్‌ బైకులపై చర్యలు తీసుకోవాలని ఎంవీఐకు లేఖ రాసినట్లు పేర్కొన్నారు.

విద్యుత్‌ షాక్‌తో మహిళ మృతి

మైలవరం : మండల పరిధిలోని కర్మలవారిపల్లె గ్రామానికి చెందిన లక్ష్మీదేవి (56) కరెంటు షాక్‌ తో మృతి చెందింది. ఆదివారం లక్ష్మీదేవి తాను ఉతికిన దుస్తులను ఇంట్లోనే ఆరబెట్టుకుంటుండగా కడ్డీలకు విద్యుత్‌ కనెక్షన్‌ తగలడంతో షాక్‌కు గురైంది. భర్త మాధవరెడ్డి భార్యకు కరెంటు షాక్‌ తగిలిందని భావించి కాపాడే ప్రయత్నం చేశాడు. అతను కూడా విద్యుత్‌ షాక్‌కు గురయ్యాడు. విద్యుత్‌ షాక్‌కు గురైన లక్ష్మీదేవిని వెంటనే ప్రభు త్వాసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి మరణించినట్లు ధృవీకరించారు.

వీఆర్‌ఓకు తీవ్ర గాయాలు    
1
1/2

వీఆర్‌ఓకు తీవ్ర గాయాలు

వీఆర్‌ఓకు తీవ్ర గాయాలు    
2
2/2

వీఆర్‌ఓకు తీవ్ర గాయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement