అనుమానం పెనుభూతమై.. | - | Sakshi
Sakshi News home page

అనుమానం పెనుభూతమై..

Oct 24 2025 7:31 AM | Updated on Oct 24 2025 7:31 AM

అనుమా

అనుమానం పెనుభూతమై..

కేవీపల్లె : అనుమానం పెనుభూతమై కట్టుకున్నవాడే కాలయముడై భార్యను హతమార్చిన సంఘటన మండలంలోని మారేళ్ల పంచాయతీ కొండకిందపల్లె దళితవాడలో జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కొండకిందపల్లె దళితవాడకు చెందిన ఊటుపల్లె రమణ భార్య యశోదమ్మ (38) బతుకుదెరువు కోసం కువైట్‌కు వెళ్లి నాలుగు నెలల క్రితం స్వగ్రామానికి వచ్చింది. గత కొన్ని రోజులుగా ఆమె ఫోన్‌లో ఇతరులతో మాట్లాడుతోందని భర్త అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున యశోదమ్మను కర్రతో కొట్టి హత్య చేశాడు. అనంతరం రమణ కేవీపల్లె పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. కలకడ సీఐ లక్ష్మన్న, ఎస్‌ఐ చిన్నరెడ్డెప్ప సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతురాలికి ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

స్కానింగ్‌ చేసిన మద్యాన్నే విక్రయించాలి

రాయచోటి టౌన్‌ : మద్యం స్కానింగ్‌ చేసి అందులో మద్యం సీసాపై ఉన్న ధరలు, ఫ్యాకింగ్‌ తేదీ, ఏ ప్రాంతంలో తయారు చేశారు అనే విషయాలు అన్నీ కనిపిస్తేనే మద్యం ప్రియులకు విక్రయించాలని అన్నమయ్య జిల్లా ఎకై ్సజ్‌ శాఖ అధికారి మధుసూదన్‌ వ్యాపారులకు సూచించారు. గురువారం రాయచోటి పట్టణంలోని పలు మద్యం షాపుల వద్దకు వెళ్లి కొనుగోలుదారులకు స్కానింగ్‌పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సీఐలు గురుప్రసాద్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకుంటాం

మదనపల్లె రూరల్‌ : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ(పీపీపీ)ను సుప్రీంకోర్టుకు వెళ్లి మరీ అడ్డుకుని తీరుతామని బహుజన్‌ సమాజ్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బందెల గౌతమ్‌కుమార్‌ అన్నారు. మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బహుజన్‌సమాజ్‌పార్టీ ఆధ్వర్యంలో అన్నమయ్యజిల్లా మదనపల్లె చిత్తూరు బస్టాండ్‌ సర్కిల్‌లో గురువారం వైద్య పోరాట ధర్నా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ... పేదలకు ఉచిత వైద్యం అందకుండా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన పిల్లలను వైద్యవిద్యకు దూరం చేసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్ర చేస్తున్నారన్నారు. మెడికల్‌ కాలేజీని ప్రైవేటు పరం చేస్తే ఊరుకునేది లేదని ప్రగల్భాలు పలికిన ఎమ్మెల్యే షాజహాన్‌బాషా, మెడికల్‌ కాలేజీ నిర్మాణంలో అవినీతిని అసెంబ్లీలో ప్రస్తావించారే తప్ప ప్రైవేటీకరణ నిలుపుదల చేయాల్సిందిగా ప్రశ్నించకపోవడం బాధాకరమన్నారు. సమావేశంలో బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రిటైర్డ్‌ జడ్జి గుర్రప్ప, రాష్ట్ర కార్యదర్శి విజయ్‌కుమార్‌, ప్రభాకర్‌, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల బీఎస్పీ నాయకులు, నియోజకవర్గాల ప్రతినిధులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.

హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్టు

చింతకొమ్మదిన్నె : స్థానిక చింతకొమ్మదిన్నె పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన హత్యాయత్నం కేసులో నిందితులైన ఇందిరానగర్‌కు చెందిన రౌడీషీటర్‌ చిలకల చాంద్‌బాషా, అతని అనుచరులైన మరో ముగ్గురు ఎర్రవల్లి అబ్దుల్‌, షేక్‌ జాకీర్‌ హుస్సేన్‌, వలీ అలియాస్‌ ఖాదర్‌ హుస్సేన్‌లను గురువారం అరెస్టు చేసినట్లు చింతకొమ్మదిన్నె సీఐ బాల మద్దిలేటి తెలిపారు.

భార్యను హతమార్చిన భర్త

అనుమానం పెనుభూతమై..1
1/2

అనుమానం పెనుభూతమై..

అనుమానం పెనుభూతమై..2
2/2

అనుమానం పెనుభూతమై..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement