 
															పిడుగుపాటుకు గేదె మృతి
రామాపురం : రామాపురం మండలం, సుద్దమళ్ల పంచాయతీ దిగువ దళితవాడకు చెందిన పెద్దివీటి కృష్ణయ్య అనే రైతుకు చెందిన గేదె గురువారం తెల్లవారుజామున ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం, పిడుగుల ప్రభావంతో మృతి చెందింది. గేదె ద్వారా పాలు విక్రయించుకుని కుటుంబాన్ని పోషించుకునే వాడినని ఇప్పుడు జీవనాధారం ప్రశ్నార్థకమైందని రైతు వాపోయాడు. రూ.50 వేలు విలువ చేసే గేదె మృతి చెందడంతో ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాడు.
పిడుగుపాటుతో
గుడిసె దగ్ధం
వీరబల్లి : మండలంలోని దిగువరాచపల్లి గ్రామ సమీపంలోని ఊట్లకుంట వద్ద బొంగాని వెంకటరమణ అనే రైతు తన పొలంలో ఏర్పాటు చేసుకున్న గుడిసైపె బుధవారం అర్థరాత్రి పిడుగు పడింది. దీంతో గుడిసె దగ్ధమైంది. గుడిసెలో నిల్వ ఉన్న వ్యవసాయ పరికరాలు, పనిముట్లు, ఎరువులు అగ్నికి ఆహుతయ్యాయి. భారీ వర్షం కురుస్తుండటంతో రైతు వెంకటరమణ పొలం నుంచి ఇంటికి వెళ్లాడు. వెళ్లిన కాసేపటికి గుడిసైపె పిడుగు పడింది. ఆసమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది.
 
							పిడుగుపాటుకు గేదె మృతి

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
