 
															మహిళ ఆచూకీ కోసం గాలింపు చర్యలు
సిద్దవటం : మండలంలోని డేగనవాండ్లపల్లి గ్రామానికి చెందిన పెసల అమ్మణ్ణమ్మ(60) బుధవారం మధ్యాహ్నం నుంచి కనిపించలేదు. బంధువులు ఇచ్చిన సమాచారం మేరకు పెన్నానది పరిసర ప్రాంతాల్లో ఒంటిమిట్ట సీఐ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది, కడప ఫైర్ డిపార్ట్‌మెంట్ వారు సదరు మహిళ ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు. పెన్నానదిలో విస్తృతంగా గాలింపులు చేపడుతున్నామని సీఐ బాబు తెలిపారు. అమ్మణ్ణమ్మ బుధవారం ఉదయం ఇంటి నుంచి గంప, కొడవలి తీసుకొని పొలం వద్దకు గడ్డి కోసం వెళ్లింది. ఆమె మధ్యాహ్నం భోజనానికి ఇంటికి రాకపోవడంతో వారి కుటుంబీకులు పొలం వద్దకు వచ్చి చూడగా అక్కడ కనిపించలేదు. పెన్నానది ఒడ్డున గంప కొడవలిని చూసి నదిలో దూకిందేమోనన్న అనుమానంతో పోలీసులకు, రెవెన్యూ అధికారులకు సమాచారం వచ్చారు. ఈ మేరకు ఒంటిమిట్ట సీఐ బాబు, రెస్క్యూటీంను రప్పించి వృద్ధురాలి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆచూకీ లభ్యం కాలేదు. మిస్సింగ్ అయిన మహిళ భర్త కొన్ని సంవత్సరాల క్రితం చనిపోయాడు. ఆమెకు ఇద్దరు కుమారులు. ఇద్దరికీ వివాహమైంది.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
