 
															‘మిట్స్’ను సందర్శించిన అమెరికన్ ప్రతినిధులు
కురబలకోట : అంగళ్లులోని మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీని అమెరికన్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ యూనివర్సిటీ సీఈఓ ప్రసాద్ మావుదురి, విద్య, కార్పొరేట్ అలయన్స్ అసోషియేట్ వైస్ చాన్స్‌లర్ చంద్రదశక బుధవారం సందర్శించారు. విద్య, పరిశోదన కార్యక్రమాలు, అధ్యాపక మార్పిడి, విద్యార్థుల అభివృద్ధి అవకాశాలు వంటి వాటిపై పరస్పర సంభావ్య సహకారాలను అన్వేషించడం ఈ సందర్శన లక్ష్యమని వీసీ యువరాజ్ తెలిపారు.
28నుంచి సివిల్ సర్వీస్ క్రీడాపోటీలకు ఎంపికలు
రాయచోటి టౌన్ : రాష్ట్ర క్రీడా అభివృద్ధి సంస్థ(శాప్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సెంట్రల్ సివిల్ సర్వీసెస్ ఉద్యోగుల సర్వీస్ కల్చరల్ అండ్ స్పోర్ట్స్ బోర్డు (సీసీఎస్‌సీ అండ్ ఎస్‌బీ) వార్షిక క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు జిల్లాస్థాయిలో ఈనెల 28 నుంచి 30 వరకు ఎంపిక పోటీలు జరగనున్నాయి. రాయచోటి నక్కవాండ్లపల్లె క్రికెట్ స్టేడియం(డీఎస్‌ఏ)లో పోటీలు జరుగుతాయని జిల్లా స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ అధికారి జి, చంద్రశేఖర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మొత్తం 19 క్రీడా విభాగాల్లో ఎంపికలు ఉంటాయన్నారు. ఇందులో పాల్గొనదలచిన ఉద్యోగులు ఈ నెల 27వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు తమ పేర్లను నమోదు చేసుకోవాలని తెలిపారు. ఈ ఎంపికల ద్వారా రాష్ట్ర స్థాయి పోటీలు నవంబర్ 5నుంచి 8వ తేదీ వరకు జరుగుతాయన్నారు. ఎంపిక కోసం వచ్చేవారు డిపార్టమెంట్ ఐడీ కార్డు,ఆధార్ కార్డు తప్పని సరిగా తీసుకురావాలని కోరారు.
జాతీయస్థాయి పోటీలకు ఎంపిక
మదనపల్లె సిటీ : జాతీయస్థాయి అండర్–14 బాలికల ఫుట్‌బాల్ పోటీలకు మదనపల్లె మండలం అడవిలోపల్లికి చెందిన రాజ్‌రోహన్‌రెడ్డి ఎంపికయ్యారు. ఆగస్టు నెలలో రాజమండ్రిలో జరిగిన పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరిచాడు. ఈనెల 26 నుంచి చత్తీస్‌గడ్‌లోని నారాయణపూర్‌లో జరిగే జాతీయ చాంిపియన్‌షిప్ పో టీల్లో పాల్గొంటారని జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దిలీప్‌కుమార్, మురళీధర్ తెలిపారు. విద్యార్థికి ఫుట్‌బాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు జాన్ కమలేష్, సంయుక్త కార్యదర్శులు మహేంద్రనాయక్, పీడీలు అంజనప్ప, మహేంద్ర, అభిలాష్ రోహన్, నరేష్ అభినందనలు తెలిపారు.
హ్యాండ్‌బాల్ జట్టు ఎంపిక వాయిదా
మదనపల్లె సిటీ : స్థానిక బీటీ కాలేజీలో గురువారం జరగాల్సిన అండర్–14,–17 బాల,బాలికల హ్యాండ్‌బాల్ జిల్లా జట్ల ఎంపిక వాయిదా పడింది. ఈ విషయాన్ని ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శులు నాగరాజు,ఝూన్నీరాణి బుధవారం తెలిపారు. అధిక వర్షం కారణంగా వాయిదా వేసిన ట్లు చెప్పారు. తదుపరి తేదీని ప్రకటిస్తామన్నారు.
కడప కోటిరెడ్డిసర్కిల్ : జిల్లా కేంద్రమైన కడపతోపాటు బద్వేలు, మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల డిపోల నుంచి జిల్లాలోని వివిధ శైవ క్షేత్రాలకు 100 ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్లు జిల్లా ప్రజా రవాణాధికారి పొలిమేర గోపాల్‌రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈనెల 27, నవంబరు 3, 10, 17 తేదీలలో కార్తీక సోమవారం సందర్భంగా శైవ క్షేత్రాలకు బస్సులు నడపనున్నామన్నారు. కడప జిల్లాలోని పొలతల, నిత్యపూజకోన, పుష్పగిరి, బ్రహ్మంగారిమఠం, లంకమల, అగస్త్యేశ్వరకోన, కన్యతీర్థం, నయనాలపుకోనతోపాటు నంద్యాల జిల్లాలోని శ్రీశైలం, అరుణాచలం, పంచరామాలు, త్రిలింగ దర్శనాలకు ప్రత్యేక ప్యాకేజీలతో బస్సులు నడపనున్నామన్నారు.
కడప కోటిరెడ్డిసర్కిల్ : ఏపీఎస్ ఆర్టీసీలో పనిచేస్తున్న కిందిస్థాయి ఉద్యోగులకు పదోన్నతులకు దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. కడప, బద్వేలు, మైదుకూరు, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, పులివెందుల, రాయచోటి, రాజంపేట డిపోల పరిధిలో పనిచేస్తున్న వారికి ఈ అవకాశం కల్పించారు. కండక్టర్లు, డ్రైవర్ల నుంచి అసిస్టెంట్ డిపో క్లర్కులుగా వంద మందిని నియమించారు. అలాగే డిపో క్లర్కులు 35 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అసిస్టెంట్ మెకానికల్ నుంచి డిప్యూటీ మెకానికల్‌గా 29 మందికి పదోన్నతి కల్పించనున్నారు. అదేవిధంగా గ్రేడ్–2 నుంచి గ్రేడ్–1కు డ్రైవర్లు 155, కండక్టర్లు 119, మెకానికల్ 24, ఆర్‌టీ జాన్స్‌లో 12 మంది చొప్పున పదోన్నతులు కల్పించనున్నారు.
 
							‘మిట్స్’ను సందర్శించిన అమెరికన్ ప్రతినిధులు

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
