 
															హరహరమహాదేవ.. శంభోశంకరా
పుష్పాలంకరణలో రామలింగేశ్వరుడు స్వామివారిని దర్శించుకుంటున్న భక్తులు
రాజంపేట టౌన్/రాజంపేట రూరల్ : కార్తీక మాసం ప్రారంభం కావడంతో జిల్లాలోని దీంతో శైవక్షేత్రాల్లో భక్తుల సందడి కనిపించింది. భక్తులు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వేకువ జాము నుంచే పెద్దఎత్తున శివాలయాలకు తరలి వచ్చారు. అనేక మంది మహిళలు దీపాలను వెలిగించారు. హత్యరాల వంటి పవిత్ర పుణ్యక్షేత్రాల్లో, నదీపరివాహక ప్రాంతాల్లో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి పూజలు చేశారు. పలు ప్రాంతాల్లో శివాలయాల్లోని శివలింగాలకు క్షీరాభిషేకం, పంచామృతాలతో అభిషేకాలు చేశారు. భక్తులకు ఆలయ కమిటీ నిర్వాహకులు తీర్దప్రసాదాలను అందచేశారు. కార్తీక మాసం ప్రారంభాన్ని పురస్కరించుకొని శివాలయాకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.
 
							హరహరమహాదేవ.. శంభోశంకరా
 
							హరహరమహాదేవ.. శంభోశంకరా

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
