 
															విధి నిర్వహణలో పారదర్శకత పాటించాలి
రాజంపేట:పోలీసులు విధి నిర్వహణలో పారదర్శకత పాటించాలని జిల్లా ఎస్పీ ధీరజ్ కనుబిల్లి పేర్కొన్నారు. బుధవారం పార్లమెంటరీ నియోజకవర్గ కేంద్రంలోని రాజంపేట అర్బన్ పీఎస్‌ను ఎస్పీ తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న కేసులను వేగంగా పూర్తి చేసి బాధితులకు న్యాయం చేయాలన్నారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు. పోలీసు వ్యవస్థపై విశ్వాసం పెంచాలన్నారు.నేరాల విచారణలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం పెంచాలన్నారు.గస్తీ చర్యలను బలోపేతం చేయాలన్నారు. ఫిర్యాదులను ఆలస్యం చేయకుండా నమోదు చేయాలన్నారు. రాజంపేట ఎఎస్పీ మనోజ్‌రామ్‌నాథ్ హెగ్డే, సీఐ నాగార్జున, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, ఎఎస్‌ఐ ఖాసీం స్టేషన్‌సిబ్బంది పాల్గొన్నారు.అనంతరం స్టేషన్‌లోని రికార్డులను ఎస్పీ పరిశీలించారు.సిబ్బందిపనితీరుగురించి ఆరా తీశారు.
ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలి
చిట్వేలి: స్టేషన్‌కు వచ్చే ప్రజలతో మర్యాదగా వ్యవహరించడం, కేసుల పురోగతిలో వేగంగా పనిచేయడం తప్పనిసరి అని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి అన్నారు. బుధవారం జిల్లా సరిహద్దులో ఉన్న చిట్వేలి పోలీసు స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు. స్టేషన్ భవనం పాతది కావడంతో మరమ్మత్తులు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం స్టేషన్ రికార్డులను పరిశీలించారు.అనుంపల్లి చెక్‌పోస్టు సరిహద్దులో ఉన్నందున నిరంతరం నిఘా ఉంచాలని, అక్రమ కార్యకలాపాలను అరికట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో రాజంపేట ఏఎస్‌ఐ పి మనోజ్ రాంనాథ్ హెగ్డే, ఎస్‌ఐ నవీన్ బాబు, సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
