
మహిళా రైతు సూరం శ్రీదేవికి జాతీయ స్థాయి పురస్కారం
రామాపురం : ప్రకృతి వ్యవసాయంలో విశేష విజయాలు నమోదు చేసుకున్న రామాపురం మండలం నల్లగుట్టపల్లెకు చెందిన మహిళా రైతు సూరం శ్రీదేవికి జాతీయ పురస్కారం లభించింది.దీనదయాల్ అంత్యోదయ యోజన–నేషనల్ రూరల్ హుడ్స్ మిషన్ ఆధ్వర్యంలో దిల్లీలో ఇటీవల నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా ఆమె ఈ పురస్కారం అందుకున్నారు. ప్రకృతి వ్యవసాయం విభాగం జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాస్ కుమార్, వెంకట మోహన్, పలువురు గ్రామీణ అభివృద్ధి అధికారులు శ్రీదేవిని అభినందించారు. సోమవారం రామాపురం ఆర్‌బీకేలో జరిగిన అభినందన సభలో మార్కెట్ కమిటీ చైర్మన్ షఫీ నాయక్, మాజీ చైర్మన్ రమేష్ రెడ్డిలు శ్రీదేవిని సన్మానించారు. మండల వ్యవసాయ అధికారి నాగమణి, ప్రకృతి వ్యవసాయ మండల మాస్టర్ ట్రైనర్ మధుకర్, మోడల్ మేకర్ సదాశివరెడ్డి, సూరం వెంకటరామిరెడ్డి, సుధాకర్, కదిరినిషా పాల్గొన్నారు.