
‘ఎర్రచందనం’ కేసులో ఇద్దరి అరెస్ట్
రాయచోటి : ఎర్రచందనం అక్రమ తరలింపు కేసులో ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. రాయచోటి అర్బన్ పోలీసుస్టేషన్‌లో సీఐ బీవీ చలపతి సోమవారం వివరాలు వెల్లడించారు. 2021 నవంబర్ 10న రాయచోటి అర్బన్ పోలీసు స్టేషన్‌లో ఎర్రచందనం అక్రమ తరలింపుపై కేసు నమోదైందని తెలిపారు. ఈ కేసులో వైఎస్సార్ కడప జిల్లా చెన్నూరు మండలం శ్రీరామ్‌నగర్‌కు చెందిన కొలిమి సుభాన్ బాషా, అర్జున్ నిందితులుగా ఉన్నారన్నారు. నాటి నుంచి పరారీలో ఉన్నారని పేర్కొన్నారు. ఆదివారం గాలివీడు రింగ్‌రోడ్డు వద్ద గుర్తించి పట్టుకున్నట్లు తెలిపారు. కేసుకు సంబంధించిన రికార్డులతో తిరుపతిలోని రెడ్ సాండిల్ స్పెషల్ కోర్టుకు హాజరు పరచగా, రిమాండ్‌కు ఆదేశించినట్లు సీఐ వివరించారు.