
విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి
సుండుపల్లె : విద్యుత్ షాక్‌తో చందు(19) అనే వ్యక్తి మృతిచెందిన సంఘటన శుక్రవారం మండల కేంద్రంలోని అగ్రహారంలో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళ్లితే.. అగ్రహారం నుంచి ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లే రహదారిలో పఠాన్ సైఫుల్లాఖాన్ కొత్త ఇంటిని నిర్మిస్తున్నారు. రాయచోటి పట్టణం ఏజీ గార్డెన్ కాలనీకి చెందిన చందు ఇంటికి కాంక్రీట్ మిక్సింగ్ పనికి వచ్చి లిఫ్ట్‌కు కట్టెలు కడుతున్నారు. ఈ సమయంలో తడితో ఉండే తాడుకు ప్రమాదవశాత్తూ పక్కనే ఉన్న 11కెవీ కరెంటు వైర్లు తగిలి షాక్‌కు గురయ్యాడు. మిద్దైపె నుండి కిందపడి కొన ఊపిరితో ఉన్న క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఐచర్ వాహనంలో రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. డాక్టర్ పరిశీలించి అప్పటికే చందు చనిపోయినట్లు నిర్ధారించారు. మతుడి తండ్రి జగన్నాథంబాషా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
13 ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
వీరబల్లి : మాండవ్య నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 13 ట్రాక్టర్లను తహసీల్దారు ఖాజాబీ శుక్రవారం పట్టుకుని స్థానిక పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. ఆమె మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా ఇతర ప్రాంతాలకు ఇసుక ట్రాక్టర్లలో తరలిస్తున్నారని తెలిపారు. ఇసుక తరలింపుతో బోర్లలో నీరు ఇంకిపోతోందని స్థానికులు తెలిపారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని కూలీ మృతి
మదనపల్లె రూరల్ : గుర్తుతెలియని వాహనం ఢీకొని కూలీ మృతిచెందిన సంఘటన గురువారం రాత్రి మదనపల్లె పట్టణంలో జరిగింది. స్థానిక కనకదాస నగర్‌కు చెందిన మల్లయ్యనాయుడు కుమారుడు జి.వెంకటరమణనాయుడు(50) నీరుగట్టువారిపల్లె టమాటా మార్కెట్‌లో కూలీగా పనిచేస్తున్నాడు. గురువారం పనుల అనంతరం కాలినడకన ఇంటికి వెళ్తుండగా భవానీనగర్ క్రాస్ నూర్ హోటల్ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొంది. తీవ్ర గాయాలైన అతడిని ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమించడంతో శుక్రవారం మృతి చెందాడు. మృతుడికి భార్య కళావతి, కుమారులు మణికంఠ, సాయికుమార్, కుమార్తె ప్రసన్న లక్ష్మి ఉన్నారు. మణికంఠ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ సీఐ రామచంద్ర తెలిపారు.

విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి