
16న కౌన్సెలింగ్
మదనపల్లె : వైఎస్సార్ కడప, అన్నమయ్యజిల్లాల్లోని 24 అంబేడ్కర్ గురుకుల, విద్యాలయాల్లో 6, 7, 8, 9 తరగతుల ప్రవేశానికి ప్రవేశ పరీక్ష రాసి సీట్లు లభించని విద్యార్థులకు ఈనెల 16న కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్టు అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల సమన్వయకర్త ఎ.ఉదయశ్రీ శనివారం తెలిపారు. కడప చిన్నచౌక్‌లోని గురుకుల వి ద్యాలయంలో వచ్చే బుధవారం విద్యార్థులు కౌ న్సెలింగ్‌కు హజరై సీట్లు పొందొచ్చని తెలిపారు.
ఆలయాలకు ధర్మకర్తల నియామకానికి దరఖాస్తులు
మదనపల్లె : జిల్లాలోని ప్రముఖ ఆలయాలకు ధర్మకర్తల మండలి నియామకం కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు అర్హత కలిగిన వారు 20 రోజుల్లోపు దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుందని జిల్లా దేవాదాయ అధికారి విశ్వనాథ్ శనివారం తెలిపారు. జిల్లాలోని మదనపల్లె మండలం బసినికొండకు చెందిన కనుమలో గంగమ్మ, నిమ్మనపల్లె మండలం తవళంలోని నేలమల్లేశ్వరస్వామి ఆలయం, పీలేరు మండలం దొడ్డిపల్లెకి చెందిన చెన్నకేశవస్వామి ఆలయం, పీలేరుకు చెందిన రౌద్రాల అంకాలమ్మ ఆలయం, రాజంపేట మండలం హత్యారాల గ్రామంలోని కామాక్షి ప్రతేశ్వరస్వామి ఆలయం, రైల్వేకోడూరులోని భుజంగేశ్వర స్వామి ఆలయం, కురబలకోట మండలం తెట్టులోని సంతాన వేణుగోపాలస్వామి ఆలయంకు దర్మకర్తల మండలిని నియమిస్తారు. దీనికోసం అసక్తి కలిగి, అర్హులైన వారు ఈనెల 29లోపు సెక్షన్ 17 (3) ప్రకారం సూచించిన ప్రొఫార్మాలో దరఖాస్తులను జిల్లా దేవదాయశాఖ అధికారికి పంపాలని విశ్వనాథ్ కోరారు.
ధర్మవరం నుంచి చర్లపల్లికి వీక్లీ స్పెషల్ ట్రైన్
కలికిరి : ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఽచర్లపల్లి నుంచి ధర్మవరం వరకు వీక్లీ స్పెషల్ రైలును ఈ నెల 13వ తేదీ నుంచి ఆగస్టు 25 వరకు తిరగనుంది. ప్రతి ఆదివారం చర్లపల్లిలో రాత్రి 7.55 గంటలకు బయలుదేరే ఈ స్పెషల్ రైలు పగిడిపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి జంక్షన్, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, ఒంగోలు, నె ల్లూరు, గూడూరు, తిరుపతి మీదుగా పాకాలకు మరుసటి రోజు ఉదయం 10.05 గంటలకు, పీలేరుకు 10.45 గంటలకు, కలికిరికి 11.05 గంటలకు, మదనపల్లె రోడ్‌కు 11.30 గంటలకు, కదిరికి మధ్యాహ్నం 12.35 గంటలకు, ధర్మవరానికి 3 గంటలకు చేరుకుంటుంది. తిరిగి సోమవారం 4.30 గంటలకు ధర్మవరంలో బయలుదేరి కలికిరి 7 గంటలకు, పాకాలకు 8 గంటలకు, తిరుపతికి రాత్రి 9 గంటలకు మరుసటి రోజు మంగళవారం ఉదయం 11 గంటలకు చర్లపల్లి స్టేషన్‌కు చేరుకుంటుంది. ఈ నెల 13, 20, 27, ఆగస్టు 3, 10, 17, 24 తేదీల్లో చర్లపల్లిలోనూ, ఈ నెల 14, 21, 28, ఆగస్టు 4, 11, 18, 25 తేదీల్లో ధర్మవరంలోనూ ఈ రైలు బయల్దేరుతుంది.
ఉప్పల హారికపై దాడి హేయమైన చర్య
రాయచోటి : రాష్ట్రంలో కూటమి పాలకులు మహిళలపై దాడులు చేయడం వారి నిరంకుశత్వ పాలనకు అద్దం పడుతోందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగం జనరల్ సెక్రటరీ మహిత అన్నారు. శనివారం ఆమె మాట్లాడుతూ కృష్ణాజిల్లా గుడివాడలో జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పల హారిక పై టీడీపీ గూండాలు దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన సంఘటనపై ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలన్నారు. కూ టమి పాలనలో రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందన్నారు.ఓ ప్రజా ప్రతినిధిగా ఉన్న మహిళను నోటితో చెప్పలేని విధంగా అసభ్య పదజాలంతో దూషించడం దుర్మార్గమన్నారు. మహిళా హోం మంత్రి ఉన్న రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఈ ప్రభత్వానికి రానున్న రోజుల్లో ప్రజలు బుద్ధి చెబుతారని పేర్కొన్నారు.