
గిట్టుబాటు ధరలు లేవు
మూడు ఎకరాలలో మామిడి చెట్లు ఉన్నాయి. దాదాపు రూ 1.50 లక్షలు పెట్టబడిపెట్టాను. అయితే కాయలు ఉన్నా అడిగేవారే లేరు. మామిడి పంటకు మూడు సార్లు మందు కొట్టాను. దిగుబడి కూడా పర్వాలేదనిపించినా ధర లేకపోవడంతో గిట్టుబాటు కాలేదు. ప్రభుత్వం మామిడి రైతులను ఆదుకోవాలి. – ఎం.నాగిరెడ్డి,
గున్నికుంట్ల, సంబేపల్లె మండలం
రూ.4లక్షలు ఖర్చు చేశా..
సుమారు 16 ఎకరాల్లో మామిడి సాగు చేశా. మందులు పిచికారి చేయడం, కొమ్మలు కత్తిరించడం తదితర యాజమాన్య నిర్వహణకు రూ. 4 లక్షలకు పైగా ఖర్చు అయింది. ఈ ఏడాది మామిడికి ధర లేక పోవడంతో కొనుగోలు చేయడానికి వ్యాపారులు ముందుకు రాలేదు. కాయలు మొత్తం రాలిపోయాయి. తీవ్రంగా నష్టం వచ్చింది. మామిడి రైతులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయి. – నారే వెంకటరమణారెడ్డి,
మామిడి రైతు, పీలేరు.
ఎన్నడూ లేనంతగా నష్టపోయాం
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది మామిడి పంటను సాగుచేసి నష్టపోయాం. 40 ఎకరాల్లో మామిడి తోటలో ప్రతిఏడాది రూ. 20 లక్షల కంటే ఆదాయం ఏనాడూ తగ్గలేదు. ఈ ఏడాది ధరలు లేకపోవడంతో లక్ష రూపాయలు కూడా రాలేదు. కనీసం తోటకు పిచికారి చేసిన మందు ఖర్చలు కూడా రాకపోవడం దారుణం. – టంగుటూరి శివారెడ్డి,
మామిడి రైతు, ఓబులవారిపల్లె మండలం

గిట్టుబాటు ధరలు లేవు

గిట్టుబాటు ధరలు లేవు