హార్సిలీహిల్స్‌పై విద్యుత్ సర్వీసులు తొలగింపు
బి.కొత్తకోట: మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్‌పై ఉన్న భవనాలకు డిస్కం అధికారులు ఇచ్చిన విద్యుత్ కనెక్షన్లలో ఎనిమిదింటిని శనివారం తొలగించారు. డిస్కం ములకలచెరువు ఏడీ, కురబలకోట ఏఈ, లైనన్‌మెన్‌లు హార్సిలీహిల్స్ వచ్చారు. కొండపై ఓ ప్రైవేటు అతిథి గృహానికి చెందిన సర్వీసుల్లో రెండింటిని, మరో ప్రై వేటు అతిథి గృహానికి చెందిన రెండు సర్వీసుల్లో ఒకటిని, ఇంకో అతిథి గృహానికి చెందిన నాలుగు సర్వీసులు, ఒక గృహానికి చెందిన సర్వీసును తొ లగించారు. ఈ విద్యుత్ సర్వీసులను తొలగించా లని రెవెన్యూ అధికారులు డిస్కం అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో ఈ చర్యలు తీసుకున్నారు.
మోహన నారసింహుడు
కలికిరి: పట్టణంలో వెలసిన శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరవ రోజు శనివారం రాత్రి నరసింహస్వామి మోహని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం తిరుమంజనం కార్యక్రమంలో భాగంగా స్వామి వారికి క్షీరాభిషేకం, పంచామృతాభిషేకం, అనంతరం ప్రత్యేక అలంకరణ చేశారు. భక్తులకు సర్వదర్శనం కల్పించారు. పల్లకీలో పురవీధులలో స్వామివారు విహరించారు. ఆవర రోజు ఉత్సవానికి సంబంధించి ఆలయ అర్చకులు మురళీధరాచార్యులు ఉభయదారుగా వ్యవహరించి కై ంకర్యాలను జరిపించారు.
బాధ్యతల స్వీకరణ
మదనపల్లె సిటీ: మదనపల్లె పట్టణం వలసపల్లిలోని జవహర్ నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్‌గా ఎం. గీత బాధ్యతలు స్వీకరించారు. రాజంపేట నవోదయ విద్యాలయ నుంచి బదిలీపై వచ్చారు. గతంలో కర్నాటక రాష్ట్రం తుముకూరు, తెలంగాణలోని ఖమ్మం, నెల్లూరులలో ప్రిన్సిపాల్‌గా పని చేశారు. ఆమె మాట్లాడుతూ నవోదయ విద్యాలయం అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానన్నారు. ఈ ఏడాది పది, 12వతరగతుల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ వేలాయుధన్ ఉన్నారు.
ఇంటర్ సప్లిమెంటరీ
ఫలితాల విడుదల
కడప కోటిరెడ్డి సర్కిల్: ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు శనివారం విడుదలయ్యాయని ఆర్‌ఐఓ బండి వెంకటసుబ్బయ్య తెలిపారు. ఫస్ట్ ఇయర్ పరీక్షలకు 5315 మంది హాజరు కాగా 2266 మంది పాస్ అయ్యారని, ఉత్తీర్ణత 46 శాతంగా నమోదైందని ఆయన పేర్కొన్నారు. సెకండ్ ఇయర్‌లో 3836 మంది హాజరు కాగా 2384 మంది పాస్ అయ్యారని, ఉత్తీర్ణత 62 శాతం నమోదైందన్నారు. రాష్ట్రంలో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ రెండింటిలో జిల్లా 15వ స్థానంలో నిలిచిందని వివరించారు.
భక్తిశ్రద్ధలతో గౌరీ వ్రతం
కడప కల్చరల్: కడప నగరం కన్యకా పరమేశ్వరీదేవి ఆలయంలో స్థానిక మహిళా భక్తులు మంగళగౌరీ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శనివారం ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్(ఆవోపా) మహిళా విభాగం ప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. హైదరాబాదుకు చెందిన కొప్పరావూరి కోటేశ్వరరావు, అఖిల పావని దంపతుల పర్యవేక్షణలో ఆలయానికి లక్ష నాణ్యతగల పసుపు కొమ్ములను సేకరించి తీసుకు రావడం విశేషం. భక్తిపూర్వకంగా కార్యక్రమాన్ని నిర్వహించినంతరం దాదాపు 400 మంది మహిళా భక్తులు లక్ష పసుపు కొమ్ముల గౌరీ వ్రతాన్ని నిర్వహించారు. సేకరించిన పసుపు కొమ్ములను రాసిగా పోసి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు చేసి పూలమాలలు అలంకరించారు. ఇటీవల కుంబాభిషేకం జరిగిన అనంతరం ఇంత పెద్ద కార్యక్రమం చేపట్టడం ఇదే తొలిసారి కావడంతో మహిళాభక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పసుపు కార్యక్రమం అనంతరం మహిళా భక్తులు ఒకరినొకరు మంగళ పూర్వకంగా వాయినాలను ఇచ్చిపుచ్చుకున్నారు. అమ్మవారి కరుణ, కృపలతో ఈ కార్యక్రమం జరగడం మహిళా భక్తులందరికీ శుభదాయకమంటూ ప్రార్థనలు నిర్వహించారు.
హార్సిలీహిల్స్‌పై విద్యుత్ సర్వీసులు తొలగింపు


