అడవిలో దారితప్పిన ఎకై ్సజ్ సీఐ, ఎస్‌ఐ సురక్షితం
ఓబులవారిపల్లె : మండలంలోని వై.కోట అటవీ ప్రాంతంలో నాటుసారా తయారు చేస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న ఎకై ్సజ్ సీఐ తులసి ఎస్‌ఐ వరుణ్ కుమార్‌తో కలిసి బుధవారం తెల్లవారుజామున అడవిలోకి వెళ్లారు. అడవిలో కాలినడకన కొద్దిదూరం వెళ్లగా దట్టమైన ప్రాంతం రావడంతో దారి తెలియక వారు తప్పిపోయారు. విషయం తెలుసుకున్న ఓబులవారిపల్లి ఎస్‌ఐ మహేష్ తమ సిబ్బందితో కలిసి వై.కోట శేషాచలం అటవీ ప్రాంతానికి చేరుకున్నారు. సీఐ తులసి లొకేషన్ పంపించడంతో దాని ఆధారంగా వారిని గుర్తించి క్షేమంగా అడవి నుంచి బయటకు తీసుకువచ్చారు. వీరు తప్పిపోయిన ప్రాంతం ఇటీవల ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి చెందిన ప్రదేశం ఒక్కటే కావడం గమనార్హం. సీఐ, ఎస్‌ఐ తప్పిపోయిన విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.


