రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
రామాపురం : కర్నూలు–చిత్తూరు జాతీయ రహదారిలో మండల పరిధిలోని ఐరిస్ హోటల్ సమీపంలో బుధవారం కారు, ద్విచక్రవాహనం ఢీ కొనడంతో వరుణ్‌కుమార్‌రెడ్డి(21) అనే యువకుడు దుర్మరణం చెందాడు. ఎస్‌ఐ వెంకట సుధాకర్‌రెడ్డి కథనం మేరకు మండలంలోని బండపల్లె పంచాయతీ వెంకటరెడ్డిగారిపల్లెకు చెందిన వరుణ్ కుమార్‌రెడ్డి ద్విచక్రవాహనంలో రాయచోటి నుంచి వస్తుండగా కడప వైపు నుంచి అరుణాచలం వెళ్తున్న ఏపీ39ఎస్‌క్యూ 5835 గల ద్విచక్రవాహనం ఢీకొంది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. చేతికి అంది వచ్చిన కొడుకు మృత్యువాత పడడంతో తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరితరం కావడం లేదు.
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం


