రాజంపేట రూరల్ : తిరుపతిలో ఈ నెల 23న ఎస్సీ వర్గీకరణ, క్రిమిలేయర్‌ను వ్యతిరేకిస్తూ రాయలసీమ మాలల సింహగర్జన నిర్వహిస్తున్నట్లు రాయలసీమ మాలల జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. స్థానిక ఆర్‌అండ్‌బీ కార్యాలయం వద్ద శుక్రవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 341కి విరుద్ధంగా ప్రధాని మోదీ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేసిందన్నారు. మాలలు అంతా ఏకమై సింహగర్జనలో దీనిని వ్యతిరేకించాలన్నారు. ఈ సమావేశంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు పూతలపట్టు ప్రభాకర్, లింగం సంజీవ్, ధన శేఖర్, పూలమరెడ్డి మల్లికార్జున, జట్టి చిరంజీవి, జనార్ధన, చౌడవరం సుబ్బనరసయ్య, సిగి చిన్నయ్య, ఈబిలి పెంచలయ్య, సుబ్బయ్య, దండప్రసాద్, కాంతయ్య, కే.హరినాథ్, రవిశంకర్, రైటర్ పుండ్రిక, కె.సుధాకర్, ఒ.పెంచలయ్య, కన్నయ్య, శ్రీను, మనోహర్, ఈశ్వరయ్య, కె.హరి, తదితరులు పాల్గొన్నారు.