కడప అర్బన్ : మోటార్ సైకిల్‌ను తప్పించబోయి అదుపు తప్పి కింద పడడంతో శేషం ఈశ్వర ప్రసాద్(12) మృతి చెందాడు. కడప నగర శివారులోని ఇండస్ట్రియల్ ఎస్టేట్ సమీపంలోని ఆర్‌పీఎస్ నగర్‌లో నివాసముంటున్న శేషం వెంకటేశ్వర్లు, ఆయన కుమారుడు ఈశ్వర్ ప్రసాద్, సోదరుడితో కలిసి మోటార్ సైకిల్‌పై ఈ నెల 17న ఎర్రముక్కపల్లికి వచ్చారు. తిరిగి అదే వాహనంలో తిరిగి వస్తుండగా, పీఎఫ్ కార్యాలయం వద్ద మరో మోటార్ సైకిల్‌ను తప్పించబోయి వారి వాహనం అదుపు తప్పి కింద పడిపోయారు. తీవ్రంగా గాయపడిన బాలుడు, అతని తండ్రిని కడప రిమ్స్‌కు 108లో తరలించారు. చికిత్స పొందుతున్న బాలుడు ఈశ్వరప్రసాద్ మృతి చెందాడు. బాలుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు శనివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కడప వన్‌టౌన్ ఎస్‌ఐ రంగస్వామి తెలిపారు.