వైఎస్సార్‌ పథకాలు శాశ్వతం | YSR schemes are permanent: Satish Reddy | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ పథకాలు శాశ్వతం

Jul 7 2025 4:25 AM | Updated on Jul 7 2025 4:25 AM

YSR schemes are permanent: Satish Reddy

అమెరికాలో జరిగిన వేడుకలో వర్చువల్‌గా మాట్లాడుతున్న సతీష్‌రెడ్డి

రాజంపేట టౌన్‌: దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు సూర్యచంద్రులు ఉన్నంత వరకు పదిలంగా, శాశ్వతంగా ఉంటాయని శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ రెడ్డి పేర్కొన్నారు. అమెరికాలోని ఫీనిక్స్‌ అరిజోనాలో ఆదివారం వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి ముందస్తు కార్యక్రమాన్ని వైఎస్సార్‌సీపీ యూఎస్‌ఏ ప్రతినిధులు నిర్వహించారు.

సతీష్ రెడ్డితోపాటు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎన్‌ఆర్‌ఐ గ్లోబల్‌ కో–ఆర్డినేటర్‌ అలూరు సాంబశివారెడ్డి, వైఎస్సార్‌సీపీ యూఎస్‌ఏ కనీ్వనర్‌ పెద్దమల్లు చంద్రహాస్‌రెడ్డి, అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ నాయకుడు విజయసాగర్‌రెడ్డి కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొని ప్రసంగించారు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే పథకాలు సక్రమంగా అమలై పేద, మధ్య తరగతి ప్రజలకు సంపూర్ణంగా అందాలంటే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తిరిగి సీఎం కావాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

జగన్‌తోనే రాజశేఖరరెడ్డి ఆశయాలు నెరవేరగలవని అన్నారు. తొలుత వైఎస్‌ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పించి, కేక్‌ కట్‌ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ యూఎస్‌ఎ ప్రతినిధులు పోలా వాసవిరాజ్‌«దీరజ్‌రెడ్డి, సోమశేఖర్‌రెడ్డి, ఎర్రపురెడ్డి, బలరామ్‌రెడ్డి, ఆదిమొరెడ్డి, శ్రీధర్‌రెడ్డి, వంశీ, చెన్నారెడ్డి, భరత్, భరత్‌రెడ్డి పాటిల్, శ్రీనివాస్, అంజిరెడ్డి, అనుదీప్, సాయిరోహిత్, ప్రణీత్, లీలాకట్ట తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement