ఉదయానంద హాస్పిటల్‌ను ప్రారంభించిన సీఎం జగన్

సాక్షి, అమరావతి : కర్నూలు జిల్లా నంద్యాలలో ఉదయానంద హాస్పిటల్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ డైరెక్టర్‌లతో వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా సీఎం మాట్లాడారు. నూతన హాస్పిటల్ ద్వారా ఆ ప్రాంత ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటున్నట్లు వైఎస్ జగన్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆర్ధికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్, ఎంపీ పోచా బ్రహ్మనందరెడ్డి, డిప్యూటీ సీఎం ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, హాస్పిటల్ డైరెక్టర్ స్వప్నారెడ్డి. తదితరులు పాల్గొన్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి