అంబేద్కర్‌ పేరును పలకడం కాదు.. ఆశయాల ఆచరణే ముఖ్యం | YS Jagan Pay Tribute On Ambedkar Birth Anniversary 2026 | Sakshi
Sakshi News home page

అంబేద్కర్‌ పేరును పలకడం కాదు.. ఆశయాల ఆచరణే ముఖ్యం

Apr 14 2026 12:32 PM | Updated on Apr 14 2026 3:12 PM

YS Jagan Pay Tribute On Ambedkar Birth Anniversary 2026

సాక్షి, తాడేపల్లి: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్‌ ఆశయాల కొనసాగింపుపై ఆయన చేసిన ట్వీట్‌ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

‘‘అంబేద్కర్‌ని గుర్తు చేసుకోవడం అంటే ఆయన వారసత్వాన్ని అనుసరించడం కాదు.. ఆ ఆశయాలను ఆచరణలో పెట్టడం. ఆయన పేరును ఎన్ని సార్లు పలుకుతామన్నది కాదు.. ఆయన విజన్‌ను ఎంత స్థిరంగా ముందుకు తీసుకెళ్తామన్నదే ముఖ్యం. అదే ఆయనకు ఇచ్చే నిజమైన గౌరవం’’ అని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆయన ఒక ఆంగ్ల పత్రిక కోసం తాను రాసిన వ్యాసాన్ని కూడా పంచుకున్నారు. ఆ వ్యాసంలో అంబేద్కర్‌ వారసత్వాన్ని కేవలం జ్ఞాపకార్థకంగా కాకుండా.. సమానత్వం, న్యాయం, రాజ్యాంగ విలువలను పాలనలో ఆచరణలో పెట్టడం ద్వారానే ఆయనకు నిజమైన నివాళి అని వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు.

అంబేద్కర్ కు వైఎస్ జగన్ నివాళి

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement