అనకాపల్లి: జిల్లాలోని అచ్యుతాపురం మండలం దుప్పుతూరులో ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. బ్రాండిక్స్ కంపెనీ ప్రహరీ గోడ నిర్మాణంపై గ్రామస్థులు ధర్నా చేపట్టారు,. నష్టపరిహారం ఇచ్చిన తర్వాతే పనులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు.

గ్రామస్థుల తీవ్ర నిరసనలతో భారీగా పోలీసుల్ని మోహరించారు. దాంతో పోలీసులు, గ్రామస్తులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. ఆందోళనలో పాల్గొన్న మహిళల్ని బలవంతంగా ఈడ్చుకెళ్లారు పోలీసులు. తోపులాటలో మహిళలు సొమ్ముసిల్లి పడిపోయారు.


