
సాక్షి, అమరావతి : జగనన్న ఆరోగ్య సురక్ష ఇంటింటి సర్వే ద్వారా రాష్ట్రంలో పౌరులకు రికార్డు స్థాయిలో ఉచితంగా వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి. ఈ నెల 11వరకు మొత్తం 5,28,33,324(ఏడు రకాల) వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ నెల 16వ తేదీ నుంచి ఏఎన్‌ఎంలు, కమ్యునిటీ హెల్త్ ఆఫీ సర్‌లు ఇంటింటికీ వెళ్లి ఆ ఇంట్లో వారికి ఆరోగ్య పరీక్షలు చేయడం ప్రారంభించారు. మరోవైపు, గత నెల 30వ తేదీ నుంచి ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తున్నారు. శిబిరాలకు భారీగా జనం వచ్చి అవసరమైన వైద్య పరీక్షలు చేయించుకోవడంతో పాటు మందులు తీసుకుంటున్నారు.
జగనన్న ఆరోగ్య సురక్ష ఇంటింటి సర్వేలో మొత్తం ఏడు రకాల పరీక్షలు చేస్తున్నారు. బీపీ, షుగర్, మూత్ర (యూరిన్), హిమోగ్లోబిన్, మలేరియా, డెంగీ, కఫం పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆరోగ్య శిబిరాలకు రాక ముందే పౌరుల ప్రొఫైల్‌తో కూడిన కేస్ షీట్‌ను ప్రింట్ చేసి ఇస్తున్నారు. అలాగే ఇంటింటి సర్వే రోగులకూ ఆరోగ్య శిబిరాల్లో కేస్ షీట్ ఇస్తున్నారు. వీరందరికీ ఆరోగ్య శిబిరాల్లో స్పెష లిస్ట్ సేవలందిస్తున్నారు. మహిళా రోగుల కో సం ప్రత్యేకంగా మహిళా వైద్యులు సేవలందిస్తు న్నారు. 172 రకాల డ్రగ్స్ అందుబాటులో ఉంచి.. అవస రాన్ని బట్టి ఉచితంగా పంపిణీ చేస్తున్నారు.
ఎల్ ఎఫ్‌టీ, ఆర్‌ఎఫ్‌టీ, సీరమ్ వంటి 53 రకాల తదుపరి పరీక్షల కోసం పీహెచ్‌సీలకు అను సంధానం చేయ డంతో పాటు ఏఎన్‌ఎం ద్వారా పరీ క్షల ఫలితాలను తెలియజేస్తున్నారు. ఆ తర్వాత ఫ్యామిలీ డాక్టర్ ద్వారా ఫాలోఅప్ చేయిస్తున్నారు. పెద్ద చికిత్సలు అవసరమైన వారిని నెట్‌వర్క్ ఆస్ప త్రులకు రిఫర్ చేస్తున్నారు. పోషకాహార ప్రదర్శనలతో పాటు ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎలా తయారుచేయాలనే దానిపైనా కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ఆరోగ్య శిబిరాల్లో టీబీ, కుష్టు పరీక్షలు చేసిన ప్పుడు పాజిటివ్ అని తేలితే ఉచితంగా వైద్యం అందిస్తున్నారు.
శిబిరాల్లోనే ఆరోగ్యశ్రీ కార్డులు
ఆరోగ్య శ్రీ కార్డుల్లేని అర్హులైనవారికి ఆరోగ్య శిబిరాల్లోనే కార్డులు మంజూరుచేస్తున్నారు. తీవ్రమైన పోష కాహార లోపం కేసులను గుర్తించడంతో పాటు, పోష కాహార పునరావాస కేంద్రాలకు సిఫారుసు చేస్తు న్నారు. పిల్లల్లో పుట్టకతో వచ్చే లోపాలను గుర్తించి అవసరమైన చికిత్సలు సూచిస్తున్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపుల్లో చికిత్సలకు వచ్చే వారి కోసం కుర్చీలు, తాగునీటి వసతి కల్పిస్తున్నారు.
ఆ రోగ్య శిబిరాల నిర్వహణకు ఒక్కో విలేజ్ క్లినిక్‌కు రూ.20 వేల చొప్పున, పట్టణ పీహెచ్‌లకు రూ.40 వేల చొప్పున ప్రభుత్వం విడుదల చేసింది. ఆరోగ్య శిబిరాలను సజావుగా నిర్వహించేందుకు గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో పీహెచ్‌సీ పరిధిలో నలుగురు, పట్టణాల్లో 4–5 పీహెచ్‌సీల పరిధిలో ఒకరిని పర్యవేక్షణ కోసం నియమించారు.