ఒడిశాతో జలవివాదాలకు తెర

MLA Dharmana Prasada Rao Comments On CM Jagan, Odisha CM Meeting - Sakshi

శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు

శ్రీకాకుళం (పీఎన్‌ కాలనీ): నేరడిపై ఉన్న అభ్యంతరాలు ఈ నెల 9తో తొలగిపోతాయని శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ఆశాభావం వ్యక్తం చేశారు. సిక్కోలు చిరకాల స్వప్నాన్ని నెరవేర్చేందుకు సీఎం వైఎస్‌ జగన్‌ ఒడిశా సీఎంతో భేటీకి ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఆయన ఆదివారం శ్రీకాకుళంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 60 ఏళ్లుగా ఒడిశాతో ఆంధ్రాకు జల వివాదాలున్నాయని, అదృష్టవశాత్తు ప్రజల సమస్యలు తెలిసిన నాయకుడు సీఎంగా ఉండడంవల్ల అవి ఇప్పుడు పరిష్కారమవుతున్నాయని చెప్పారు.

వంశధారపై నేరడి బ్యారేజీకి 1962లో అప్పటి సీఎం దామోదరం సంజీవయ్య శంకుస్థాపన చేశారని, ఆ తర్వాత వైఎస్సార్‌ వచ్చేంతవరకు ఈ ప్రాజెక్టును ఎవరూ పట్టించుకోలేదని గుర్తుచేశారు. వైఎస్సార్‌ వంశధార ఫేజ్‌–2, స్టేజ్‌–2 పనులకు శ్రీకారం చుట్టారని, అప్పుడే నేరడి బ్యారేజ్‌ నిర్మాణానికి ముందడుగు వేసినా ఒడిశా ప్రభుత్వం కోర్టులకెళ్లడంతో పనులు సాగలేదని చెప్పారు. నేరడి బ్యారేజ్‌ నిర్మిస్తే ఒడిశాలో 50 వేల ఎకరాలకు, ఆంధ్రాలో 2.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు.  

చదవండి: (సిక్కోలు చిరకాల కల.. ఈ నెల 9న ఒడిశా ముఖ్యమంత్రితో సీఎం జగన్‌ భేటీ)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top