మీడియా హక్కుల కోసం పోరాటం ఉధృతం చేస్తాం

Macha Ramalinga Reddy 2 Days Hunger Strike From September 22 - Sakshi

సాక్షి, అనంతపురం : మీడియా హక్కుల కోసం పోరాటం ఉధృతం చేస్తామని, ఈనెల 22వ తేదీ నుంచి 48 గంటల నిరాహార దీక్ష చేస్తామని ఏపీ జర్నలిస్ట్ డెవలప్‌మెంట్ సొసైటీ అధ్యక్షుడు మచ్చా రామలింగారెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ హైకోర్టు తీర్పు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టన్నారు. అమరావతి భూ కుంభకోణంపై ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌పై ఎందుకు వార్తలు ఇవ్వకూడదని ప్రశ్నించారు. జడ్జిలకు ఒక న్యాయం.. సామాన్య ప్రజలకు మరో న్యాయం ఎక్కడిదన్నారు. హైకోర్టు తీర్పు వల్ల న్యాయ వ్యవస్థపై విశ్వాసం తగ్గే ప్రమాదం ఉందన్నారు. జడ్జిలు పరిమితులకు లోబడి వ్యవహరించాలని, ఏపీ హైకోర్టు తీరుపై సుప్రీం కోర్టు, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top