సాక్షి, కోనసీమ జిల్లా: రామచంద్రాపురంలో పదేళ్ల బాలిక రంజిత మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతిపై బాలిక తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంటి ఓనర్ కుమారుడు జకీర్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జకీర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో ఫుటేజ్ దొరకలేదు.
బాలిక మృతి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఐదో తరగతి చదువుతున్న 11 ఏళ్ల రంజిత ఇంట్లో ఎవరు లేని సమయంలో చున్నీతో ఫ్యాన్‌కి ఉరిపోసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఉదయం స్కూలుకు వెళ్లిన బాలిక.. సాయంత్రం ఆత్మహత్యకు పాల్పడటంపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. బాలికలు ఎవరైనా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారేమోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కేసు నమోదు చేసిన రామచంద్రాపురం పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
బాలిక తల్లి సునీత స్థానిక ఏరియా ఆసుపత్రిలో స్టాఫ్ నర్సుగా పని చేస్తుండగా, తండ్రి రాజు ముంబైలో మెరైన్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. దంపతులకు రంజిత చిన్న కుమార్తె కాగా, నవోదయాలో పెద్దకుమార్తె తొమ్మిదో తరగతి చదువుతోంది. కాకినాడలో ఉన్న బంధువులు వద్దకెళ్లిన తల్లి.. ఆమె వచ్చేసరికి ఈ ఘటన చోటుచేసుకుంది. బాలికను ఎవరైనా హత్య చేశారా? అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.



