పెద్దాపురంలో జియో ఫైబర్ సేవలు ప్రారంభం

Jio Fiber Service In Peddapuram In Andhra Pradesh - Sakshi

రూ.399 నుంచి ఆకర్షణీయమైన ప్లాన్స్

తూర్పు గోదావరి : జియో ఫైబర్ తన హై స్పీడ్ ఇంటర్నెట్ సేవలను పెద్దాపురంలో లాంఛనంగా ప్రారంభించింది. ప్రారంభ ఆఫర్ కింద పెద్దాపురం పట్టణ ప్రజలకు జియో 150 ఎంబీపీఎస్ స్పీడ్‌తో 30 రోజుల ఉచిత సేవలను అందిస్తోంది. ఫ్రీ ట్రయల్‌లో భాగంగా 4కే సెట్ టాప్ బాక్స్, ఉచిత 10 ఓటీటీ యాప్స్ సబ్‌స్క్రిప్షన్, ఉచిత వాయిస్ కాలింగ్. అన్నింటికీ మించి వినియోగదారులకు అపరిమితమైన డేటా అందుబాటులో ఉంటుంది. ఒకవేళ 30 రోజుల్లో సర్వీస్ నచ్చకపోతే కనెక్షన్ వద్దని చెప్పొచ్చు. ఎలాంటి కండీషన్స్ ఉండవు. ఈ 30 రోజుల ఫ్రీ ట్రయల్ కొత్త కస్టమర్లకు మాత్రమే. ఈ సేవల ప్రారంభం సందర్భంగా జియో ఆంధ్రప్రదేశ్ సీఈఓ మండపల్లి మహేష్ కుమార్ మాట్లాడుతూ, "మొబైల్ కనెక్టివిటీ పరంగా ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే జియో వేగంగా , విస్తృతంగా దూసుకువెళ్లి నెంబర్ వన్ ఆపరేటర్ గా నిలిచింది.

ఇదే పరుగును బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ రంగంలో కూడా కొనసాగించి జియో ఫైబర్‌ను పెద్దాపురం పట్టణంలో ప్రతీ ఇంటికి తీసుకెళ్లి, ఆ ఇంట్లో ప్రతీ ఒక్కరికీ డిజిటల్ ప్రపంచాన్ని పరిచయం చేయాలనుకుంటున్నాం" అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో జియో ఫైబర్ ఇప్పటికే అన్ని ప్రధాన నగరాలు, పట్టణాల్లో అందుబాటులో ఉంది. విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి, నెల్లూరు, రాజమండ్రి, కాకినాడ, అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు, ఏలూరు, ఒంగోలు, విజయనగరం, శ్రీకాకుళం, హిందూపూర్, తెనాలి, బొబ్బిలి తదితర పట్టణాల్లో వినియోగదారులు జియో ఫైబర్ సేవలను ఆస్వాదిస్తున్నారు. ఆసక్తిగల కస్టమర్లు ఇక్కడ తమను తాము నమోదు చేసుకోవచ్చు  https://www.jio.com/registration'
 

నయా ఇండియా కా నయా జోష్ ' పేరుతో జియో సరికొత్త ప్లాన్స్ వివరాలు. ఇవిగో...

JioFiber Rs 399 Plan: జియోఫైబర్ రూ.399 ప్లాన్ తీసుకుంటే 30 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఇంటర్నెట్ ఉపయోగించొచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితం.

JioFiber Rs 699 Plan: జియోఫైబర్ రూ.699 ప్లాన్ తీసుకుంటే 100 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఇంటర్నెట్ ఉపయోగించొచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితం.

JioFiber Rs 999 Plan: జియోఫైబర్ రూ.999 ప్లాన్ తీసుకుంటే 150 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఇంటర్నెట్ ఉపయోగించొచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితం.

రూ.1000 విలువైన 11 ఓటీటీ యాప్స్ సబ్‍స్క్రిప్షన్స్ ఉచితం.

jioFiber Rs 1499 Plan: జియోఫైబర్ రూ.1499 ప్లాన్ తీసుకుంటే 300 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఇంటర్నెట్ ఉపయోగించొచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితం.

రూ.1500 విలువైన 12 ఓటీటీ యాప్స్ సబ్‍స్క్రిప్షన్స్ ఉచితం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top