
సాక్షి, అమరావతి: ఏపీ కార్మిక మంత్రిగా గుమ్మనూరు జయరాం బాధ్యతలు చేపట్టారు. బుధవారం ఉదయం సచివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బీసీలకు మంత్రి పదవులు ఇచ్చారన్నారు. బీసీలంతా ఎప్పటికీ సీఎం జగన్‌కి అండగా ఉంటారన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ లకు సీఎం అధిక ప్రాధాన్యం ఇచ్చారన్నారు. రాష్ట్రంలో స్థానిక యువతకు 75 శాతం ఉద్యోగాలు కల్పిస్తున్నారని, ఇందుకోసం ప్రత్యేక బిల్లు తెచ్చారని గుర్తు చేశారు. కార్మికులకు ఈఎస్ఐ ద్వారా వైద్యం అందించడంతో పాటు ఈ-ఔషధ ద్వారా పాదర్శక విధానం తీసుకొచ్చామని మంత్రి పేర్కొన్నారు.
చదవండి: ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్య యజ్ఞం
రాజకీయ నేపథ్యం:
2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి ఆలూరులో పాటీచేసి ఓటమి పాలయ్యారు. 2012లో వైఎస్సార్‌సీపీలో చేరారు. 2014, 2019 ఎన్నికల్లో ఆలూరు నుంచి వైఎస్సార్‌సీపీ తరఫున ఎమ్మెల్యేగా విజయం సాధించారు.