కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలో పీజీ సీటు ఫీజు రూ.29 లక్షలు | Govt finalises PG medical fees for new colleges: Andhra pradesh | Sakshi
Sakshi News home page

కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలో పీజీ సీటు ఫీజు రూ.29 లక్షలు

Dec 5 2025 5:46 AM | Updated on Dec 5 2025 5:46 AM

Govt finalises PG medical fees for new colleges: Andhra pradesh

చంద్రబాబు సర్కారు నిర్ణయం 

సాక్షి, అమరావతి: తాము అధికారంలోకి వస్తే కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోటాను వంద రోజుల్లో రద్దు చేస్తామని హామీ ఇచి్చన చంద్రబాబు.. గద్దెనెక్కిన తర్వాత విద్యార్థులకు వెన్నుపో­టు పొడిచారు. ఒకవైపు 10 నూతన ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్‌కు కట్టబెడుతున్నారు. మరోవైపు ఆ కాలేజీల్లోని పీజీ సీట్లను అమ్మకానికి పెట్టేశా­రు. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ హయాంలో ప్రారంభిం­చిన 5 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలకు మంజూరైన పీజీ సీట్లకు సెల్ఫ్‌ ఫైనాన్స్‌ విధానాన్ని వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకున్నారు. 

ఒక్కో పీజీ సీటుకు రూ.29 లక్షల వసూలుకు సీఎం చంద్రబాబు ఆమో­­దం తెలిపారు. పీజీ కోర్సుల్లో ప్రభుత్వ కోటా సీటుకు రూ.30 వేలు, సెల్ఫ్‌ ఫైనాన్స్‌ సీటుకు రూ.9 లక్షలు, ఎన్‌ఆర్‌ఐ కోటా సీటుకు రూ.29 లక్షలుగా ఫీజులు ఖరారు చేశారు. 2025–26 విద్యా సంవత్సరానికి 5 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 4 కోర్సు­ల్లో 60 పీజీ సీట్లను నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌(ఎన్‌ఎంసీ) మంజూరు చేసింది.

రాజమండ్రి, నంద్యాల కళా­శాలల్లో 16 సీట్లు చొప్పున, విజయనగరం, మచిలీపట్నం కళాశాలల్లో 12 చొప్పున, ఏలూరు కళా­శాలలో 4 పీజీ సీట్లకు అడ్మిషన్లు చేపట్టనున్నా­రు. కాగా, 50 శాతం సీట్లు ఆలిండియా కోటాకు పోగా, మిగిలిన 50 శాతం సీట్లను రాష్ట్ర కోటాలో యూని­వర్సిటీ భర్తీ చేయనుంది. ఈ 50 శాతంలో సగం కన్వీనర్‌ కోటాకు, 35 శాతం సెల్ఫ్‌ఫైనాన్స్, 15 శాతం ఎన్‌ఆర్‌ఐ కోటాకు కేటాయించారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement