
శ్రీకాకుళం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తీరుతో ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. సర్వేల పేరుతో తమను వేధిస్తున్నారని శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయం వద్ద సచివాలయ ఉద్యోగుల ఆందోళనకు దిగారు. ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 10 గంటలకు పని చేయాల్సి వస్తుందని, వాలంటీర్లు చేయాల్సిన పనులు కూడా తమతో చేయిస్తున్నారని నిరసన చేపట్టారు.

పనిభారం పెరగడంతో మానసిక ఒత్తిడి అధికమవుతుందని సచివాలయ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. మహిళా ఉద్యోగులు అని కూడా చూడకుండా రాత్రి పూట కూడా పని చేయిస్తున్నారని విమర్శించారు. అదే సమయంలో తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ నిరసన వ్యక్తం చేస్తున్నారు.