బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా: కార్తీక మాసం పురస్కరించుకుని సెంట్రల్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఆలయంలో పనిచేసే ద్రాక్షారామకు చెందిన దొంగ భీమన్న శనివారం గడ్డి మిషన్‌తో గడ్డిని కోస్తున్న క్రమంలో విద్యుత్ ప్రమాదానికి లోనై మృతి చెందాడు. గుర్తించిన ఆలయ సిబ్బంది ద్రాక్షారామ పోలీసులకు సమాచారం ఇవ్వగా పోస్టుమార్టం నిమిత్తం రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు.
ద్రాక్షారామ ఎస్ఐ ఎం లక్ష్మణ్ ప్రాథమిక అంచనా కోసం సంఘటన స్థలాన్ని పరిశీలించారు.. ఆలయ ఈవో అల్లు వెంకట దుర్గా భవాని ఆలయాన్ని మూసివేసి సంప్రోక్షణ చేయనున్నట్లు తెలిపారు. మహా నివేదన అనంతరం స్వామివారికి మూడు గంటల నుంచి భక్తులను దర్శించుకోవచ్చు అని ఆలయ అర్చకులు తెలిపారు.


