25,909 మందికి వ్యాక్సిన్లు | Covid-19 Vaccine For 25909 People In AP | Sakshi
Sakshi News home page

25,909 మందికి వ్యాక్సిన్లు

Feb 6 2021 4:04 AM | Updated on Feb 6 2021 4:04 AM

Covid-19 Vaccine For 25909 People In AP - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రెండో విడత వ్యాక్సినేషన్‌లో భాగంగా శుక్రవారం 25,909 మందికి వ్యాక్సిన్లు వేశారు. వారిలో హెల్త్‌కేర్‌ వర్కర్లు 4,255 మంది ఉండగా.. ఇతర శాఖలకు చెందిన ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు 21,654 మంది ఉన్నారు.  

ఏపీలో 97 పాజిటివ్‌ కేసులు
రాష్ట్రంలో గత 24 గంటల్లో 33,876 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, 97 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఒకే రోజులో 179 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 1,32,76,678 టెస్టులు చేయగా 8,88,275 కేసులు నమోదయ్యాయి. వీరిలో 8,80,046 మంది కోలుకున్నారు. కోవిడ్‌ వల్ల తాజాగా కృష్ణా జిల్లాలో ఒకరు మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 7,158కి చేరింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement